చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంటెక్కిస్తున్న టమాటా ధరలు.. సెంచరీ దాటి పైపైకి; కారణాలు ఇవే!!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా టమాట ధరలు మండిపోతున్నాయి. విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులు ఇలా అయితే ఎలా బ్రతకటం అని నిట్టూరుస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమంటున్నారు.

టమాటా ధరలతో ఏం వండాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్న గృహిణులు

టమాటా ధరలతో ఏం వండాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్న గృహిణులు

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన విపరీతమైన వర్షాలు టమాట ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించగా, ఇప్పుడు ఒక్కసారిగా 100రూపాయలకు పైగా పెరిగింది. ఇక సూపర్ మార్కెట్ లలో టమాటా ధరలు అసాధారణంగా రూ.125 లకు అమ్ముతున్నారు. ప్రతి ఇంట్లో నిత్యం కూరల్లో కచ్చితంగా వాడే టమాటాలు రోజురోజుకు ధరల పెరుగుదలతో ఆకాశాన్ని తాకటంతో కూరలు వండాలి అంటేనే ఇబ్బంది పడుతున్నారు గృహిణులు.

శ్రీలంకకు ఎగుమతి అవుతున్న టమాటాలు..

శ్రీలంకకు ఎగుమతి అవుతున్న టమాటాలు..


గతంలో గిట్టుబాటు ధర లేక పలు సందర్భాల్లో రైతులు టమోటాలను రోడ్లపై పారబోశారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న టమాటాల ధరలు టమాటా రైతులలో సంతోషానికి కారణం కాగా, సామాన్యులు కొనుగోలు చెయ్యలేక లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ నగరంలో విక్రయించే టమాటాలు ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వస్తాయి. శ్రీలంక లో వచ్చిన సంక్షోభం కారణంగా ఈసారి టమాటాలు ఎక్కువగా శ్రీలంకకు ఎగుమతి అవుతున్నాయి. ప్రతి రోజూ శ్రీలంకకు 50 ట్రక్కుల వరకు ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తుంది. 25కేజీల టమాటాలు 1,300 నుండి 1,400 రూపాయలు పలకడంతో రైతులు శ్రీలంకకు టమాటా ఎగుమతిపై దృష్టిసారించారు. దీంతో రాష్ట్రంలో డిమాండ్ కు తగిన టమాటాలు సరఫరా కాక తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లలోనూ టమాట ధర విపరీతంగా పెరిగింది.

టమాటాల ధరల పెరుగుదలకు అనేక కారణాలు

టమాటాల ధరల పెరుగుదలకు అనేక కారణాలు

నిపుణులు ధరల పెరుగుదల వెనుక నాలుగు ముఖ్యమైన అంశాలను ఉదహరించారు. అకాల వర్షాలు, ఎండాకాలం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతినడంతో పాటు టమాటా సరఫరా కూడా దెబ్బతిందని వారు తెలిపారు. ఇక శ్రీలంక కు టమాటాల ఎగుమతి, ఇంధనం ధరల ప్రభావం కూడా టమాటాల ధరల పెరుగుదలకు కారణాలుగా చెప్తున్నారు. హైదరాబాద్‌లో 60% టమాటా సరఫరా ఇతర రాష్ట్రాల నుండి, ప్రధానంగా ఏపీలోని కర్నూలు జిల్లా నుండి, చిత్తూరు జిల్లా నుండి వస్తుంది. సరఫరా-డిమాండ్ సరిపోలకపోవడంతో పొరుగు రాష్ట్రాల సరఫరాదారులకు మేము ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది అని బోయినపల్లి మార్కెట్ యార్డు సమీపంలో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు చెప్తున్నారు.

 ఏపీలోనూ విపరీతంగా టమాటా ధరలు

ఏపీలోనూ విపరీతంగా టమాటా ధరలు

ధరల పెంపు వెనుక సాధారణ కారణం అయిన ఇంధన ధరల పెంపు ప్రభావం కారణంగా భారీ రవాణా ఛార్జీలు పెరగటం కూడా కారణంగా కనిపిస్తుంది. ఇంధనంపై ఇటీవలి ఎక్సైజ్ సుంకం కోతల ప్రయోజనం తమ రవాణా ఛార్జీలను తగ్గించలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు రైతు బజార్లకు నిల్వలు రాకపోవడంతో ఏపీ కూడా టమోటా కొరతతో అల్లాడుతోంది. అన్నమయ్య మదనపల్లె మార్కెట్‌లో కిలో 100 , చిత్తూరు జిల్లాలోని పలమనేరు , పుంగనూరు మార్కెట్లలో కూడా 100 రూపాయల ధర ఉంది.

దేశ వ్యాప్తంగా ధరల మంట.. సామాన్యుల తంటా

దేశ వ్యాప్తంగా ధరల మంట.. సామాన్యుల తంటా

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కూడా టమాటా ధరల పరిస్థితి ఇలాగే ఉంది. తీవ్రమైన టమాటా కొరత ఇప్పుడు దేశాన్ని వేధిస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా టమాటాలకు ఇబ్బంది ఉంది. టమాటాలకు అతిపెద్ద మార్కెట్ అయిన కోలార్ లో కూడా టమాటా ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. కూరగాయలలోనే అత్యధిక వినియోగం ఉండే టమాటా ధరలు చుక్కల్లో ఉండటంతో ధరలను తగ్గించాలని ప్రభుత్వాలకు సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Tomato prices are skyrocketing in telugu states. Tomatoes inflame buyers with skyrocketing prices. The common man could not buy tomatoes due to the huge increase in prices. Tomatoes are priced at over Rs 100.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X