చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపిలో చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన పాలమూరు నేతల్లో కాల క్రమేణా పార్టీకి దూరమయ్యారు. పార్టీలో చాలా కాలం నుండి ఇదే చరిత్ర కొనసాగుతోంది. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. గతంలో నాగం జనార్థన్‌రెడ్డి టిడిపిలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం కారణంగా నాగం జనార్థన్‌రెడ్డి పార్టీకి దూరమయ్యారు. రేవంత్ కూడ అదే దారిలో వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu

తెలుగుదేశం పార్టీలో నాగం జనార్థన్‌రెడ్డి కీలకంగా 2009 ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమం సాగే వరకు కీలకంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియాలో నాగం జనార్థన్‌రెడ్డిపై దాడి తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చిందంటారు.

తెలంగాణ విషయమై పార్టీ వేదికలపై, బయట కూడ నాగం జనార్థన్‌రెడ్డి చేసే వ్యాఖ్యల కారణంగా పార్టీ ఆయనపై వేటేసింది.పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయాలు తీసుకొనే పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నాగం జనార్థన్‌రెడ్డి ఉండేవాడు. అయితే నాగం జనార్థన్‌రెడ్డిపై 2011 మే 26 సస్పెన్షన్ వేటేసింది. కొంత కాలానికి నాగం జనార్థన్‌రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని కూడ వదులుకొన్నారు.

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. పాలమూరు జిల్లా నుండి టిడిపిలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నేతగా రేవంత్‌రెడ్డికి పేరుంది.

నాగం జనార్థన్‌రెడ్డిపై వేటు ఇలా

నాగం జనార్థన్‌రెడ్డిపై వేటు ఇలా

తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ నేతలపై నాగం జనార్థన్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు కొందరు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టిడిపి సమావేశానికి హజరై సమావేశం నుండి అర్ధాంతరంగా వాకౌట్ చేశారు. బయటకు వెళ్ళే సమయంలో కూడ నాగం పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయమై ఆ సమయంలో పార్టీలో ఉన్న నేతలు నాగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కరీంనగర్‌ జిల్లాలో తెలంగాణ టిడిపి ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నాగం హజరుకాలేదు. కానీ, ఈ సభ జరుగుతున్న సమయంలోనే పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ పొలిట్‌బ్యూరో సమావేశంలోనే నాగం జనార్థన్‌రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.అయితే నాగంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు పొలిట్‌బ్యూరోకు ఆ సమయంలో సిఫారసు చేశారు. దీంతో నాగంపై ఆ సమయంలో వేటు పడింది.

పార్టీ మారుతారని రేవంత్‌పై ప్రచారం

పార్టీ మారుతారని రేవంత్‌పై ప్రచారం

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని రేవంత్‌రెడ్డి కలిశారనే ప్రచారం నేపథ్యంలో వేటేయాలని డిమాండ్ మొదలైంది. కొడంగల్‌లో రేవంత్ ఇచ్చిన వివరణ పట్ల పార్టీ నాయకత్వం సంతృప్తిగా లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రేవంత్‌పై చర్య కోసం పొలిట్‌బ్యూరో సమావేశంలో పలువురు నేతలు డిమాండ్ చేశారని సమాచారం.

 వైఎస్‌పై నాగం జనార్థన్‌రెడ్డి, కెసిఆర్‌పై రేవంత్

వైఎస్‌పై నాగం జనార్థన్‌రెడ్డి, కెసిఆర్‌పై రేవంత్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 నుండి 2009 వరకు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టిడిపి ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి ఒంటికాలిపై లేచేవారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాలపై నాగం ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనూ బయట దుమ్మెత్తిపోసేవారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఓబులాపురం గనుల విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని నాగం జనార్థన్‌రెడ్డి ఇరుకునపెట్టారు.2009లో కూడ వైఎస్ బతికున్న కాలంలో కూడ నాగం వైఎస్‌పై విరుచుకుపడ్డారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక కెసిఆర్‌పై రేవంత్‌ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టాడు.టిడిపి వర్సెస్ టిఆర్ఎస్ తరహలో అసెంబ్లీ నడిచింది. కొన్ని కారణాలతో అసెంబ్లీ నుండి టిడిపి సభ్యులను సస్పెన్షన్ చేశారు.అయితే ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం మారుతున్నట్టు కన్పిస్తున్నాయి.

బాబుకు అత్యంత సన్నిహితులు పార్టీకి దూరం

బాబుకు అత్యంత సన్నిహితులు పార్టీకి దూరం

చంద్రబాబుకు, టిడిపిలో రెండవ స్థానంలో ఉన్న నేతలు కాలక్రమేణా .పార్టీకి దూరమైన ఘటనలు అనేకం ఉన్నాయి. నాగం జనార్థన్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్ లాంటి నేతలు పార్టీకి దూరమయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేవేందర్‌గౌడ్ పార్టీలోకి తిరిగి వచ్చారు. కానీ, నాగం జనార్థన్‌రెడ్డి ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.నాగం జనార్థన్‌రెడ్డి పార్టీకి దూరమైన తర్వాత పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డికి టిడిపి నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బాబుకు అత్యంత సన్నిహితంగా రేవంత్ మెలిగాడు. పొత్తుల వ్యవహరంలో రేవంత్ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ లేకుండా పొలిట్‌బ్యూరో సమావేశం వెనుక

రేవంత్ లేకుండా పొలిట్‌బ్యూరో సమావేశం వెనుక

తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి లేకుండానే ఆదివారం నాడు పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించడం టిడిపి వ్యూహత్మకంగా అడుగుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో తాను టిడిపిలోనే కొనసాగుతానని చంద్రబాబుతో సమావేశమై అన్ని విషయాలు వెల్లడించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడ ఆయన వ్యూహంలో భాగమేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకూడదని టిడిపి తెలంగాణ పొలిట్‌బ్యూరో సమావేశం తీర్మాణం చేసినట్టు సమాచారం. చంద్రబాబుకు తెలియకుండా టిడిపి తెలంగాణ నేతలు ఈ నిర్ణయం తీసుకొంటారా అనే చర్చ కూడ లేకపోలేదు.అదే సమయంలో రేవంత్ కూడ బాబును కలుస్తానని చెప్పడం కూడ వ్యూహత్మకమేననే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.రేవంత్ అపాయింట్‌మెంట్ అడిగితే బాబు అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా అనేది ఉత్కంఠ కల్గిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is spreading rumour on Revanth Reddy join Congress, If Revanth Reddy join in Congress, From Mahaboobnagar district After Nagam janardhan Reddy Revanth Reddy top leader for Tdp.Revanth will plannig to leave Tdp.
Please Wait while comments are loading...