తెలంగాణలో మరో ఉప ఎన్నిక - తేల్చేసిన టీపీసీసీ చీఫ్..!!
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఫలితం పై ఉత్కంఠ కొనసాగుతోంది. హోరా హోరీగా సాగిన ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు చివరి వరకు ప్రయత్నించాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేల్చాయి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు.. ఫలితం వెలువడనుంది. ఇదే సమయంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీని పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఫలితంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ పైనా స్పష్టత ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఫలితం పైన కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఇవ్వటంతో నేతలు ఖుషీగా ఉన్నారు. ఈ ఎన్నిక ద్వారా పార్టీ బలం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ ఆరోపణలను తప్పు బట్టారు. ఓడిపోయే పార్టీలు అదే విధంగా మాట్లాడుతారని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ జూబ్లీహిల్స్ లో ఎందుకు ప్రచారం చేయలేదో తమకు తెలియదని.. ఇంపార్టెంట్ వ్యక్తులకు కెసిఆర్ ఫోన్ లు చేసినట్లు మాకు సమాచారం ఉంద ని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ - తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మహేష్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ గా తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. మంత్రి పదవి కావాలని తాను ఎక్కడ అడగడం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు.
తాను పార్టీ లో ఆర్గనైజషన్ నుంచి వచ్చానని.. తనకు పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తానని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. తనకు సీఎం తో పాటు మంత్రివర్గం మొత్తం పూర్తిగా సహకారం అందిస్తున్నారు. తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగిందన్న మహేష్ గౌడ్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. నిజామాబాద్‌లో ఓటు చోరీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఓల్డ్ సిటీలో ఆధారాలను ఫిరోజ్ ఖాన్ బయట పెట్టాడని, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ప్రచారం పైన స్పందించిన మహేష్ గౌడ్.. తాను ఉప ఎన్నిక వస్తుందని అనుకోవటం లేదని చెప్పారు. ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందని.. దానం నాగేందర్ కు తమ పార్టీ విధానాలు నచ్చి తమతో ప్రయాణం చేస్తున్నారని వివరించారు. బీసీ రిజర్వేషన్ల పైన కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications