ఏపీలో టీడీపీని వదలం, పవన్ తో నష్టమే : రేవంత్ సంచలనం..!!
ఏపీ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో అధికారం ఖాయమనే ధీమాతో ఉన్న రేవంత్..తన నెక్స్ట్ టార్గెట్ ఏపీనేనని స్పష్టం చేసారు. ఏపీలో టీడీపీపైన పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. బీజేపీతో జత కట్టిన పవన్ కు ఏపీలో నష్టమేనని పేర్కొన్నారు. టీడీపీతోనే గుర్తింపు లభించిందని.. కానీ.. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తాను కాంగ్రెస్ వాదినని క్లారిటీ ఇచ్చారు. సీఎం పదవి పైనా స్పష్టత ఇచ్చారు.
ఏపీలో రేవంత్ ప్రచారం:తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు రేవంత్ ప్రత్యేకార్షణగా నిలిచారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ప్రచారం వేళ రేవంత్ ఏపీ రాజకీయాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో 80 -85 సీట్లు సాధిస్తామని ధీమా గా చెబుతున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో తనకు టీడీపీతో బంధం.. ఏపీ ఎన్నికల్లో తన పాత్ర పైన క్లారిటీ ఇచ్చారు. టీడీపీ వల్లే తనకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత లభించిందని చెప్పుకొచ్చారు. తాను తెలంగాణలో రాజకీయాల వలనే టీడీపీ వీడానని..అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి లేఖ ఇచ్చానని గుర్తు చేసారు. తాను ఎక్కడా చంద్రబాబు..టీడీపీపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్దులకు టీడీపీ కేడర్ మద్దతిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

హామీలు నెరవేర్చేందుకు:ఏపీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసే క్రమంలో టీడీపీతో ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. పార్టీ వైఖరికి భిన్నంగా ఉంటే తనను తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ తో అక్కడ ప్రమాదం ఉండే అవకాశం ఉందని గతంలోనూ రేవంత్ చెప్పుకొచ్చారు. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదన్నారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని, ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. వీటి సాధన కోసం తాము ఏపీలో ప్రజల తరపున నిలబడతామని రేవంత్ వివరించారు.
టీడీపీ మద్దతు తప్పు కాదు:ఏపీలో రెండు పార్టీలకు మద్దతుగా నిలిచే రెండు ప్రధాన వర్గాలు తెలంగాణలో తమకు ఎంత వదరకు మద్దతు ఇస్తున్నారనేది క్లారిటీ లేదన్నారు. అలా జరిగితే ఆ రెండు వర్గాలను ఏకం అయినందుకు తాను హ్యాపీ ఫీలవుతానని రేవంత్ పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి పైనా పార్టీ హైకమాండ్ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని...బీఆర్ఎస్ 25 సీట్లను దాటదని రేవంత్ ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తాను బాధ పడ్డానని వెల్లడించారు. తాను అధికారంలోకి వచ్చినా ఎటువంటి కక్ష్య పూరిత రాజకీయాలు ఉండవని స్పష్టం చేసారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications