వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవును..రేవంత్ రెడ్డి- కోమటిరెడ్డి ఒక్కటయ్యారు : సీనియర్లకు షాక్..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నారు. గాంధీ భవన్ ఇందుకు వేదిక అయింది. ఇద్దరి మధ్య కొంత కాలంగా సాగుతున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడుమ ఈ ఇద్దరి సడన్ కలయిక పార్టీలో ఆసక్తిగా మారింది. పార్టీ రాష్ట్ర కొత్త ఇంఛార్జ్ థాక్రే గాంధీ భవన్ కు వచ్చారు. థాక్రే ఆహ్వానం తో గాంధీ భవన్ కు కోమటిరెడ్డి వచ్చారు. రేవంత్ తో కలిసి భేటీ అయ్యారు.ఇద్దరు నేతలు హాత్ సే హాత్ జోడో అంటూ.. కలిపారు. పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా పని చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామం రేవంత్ తో విభేదిస్తున్న సీనియర్లకు షాక్ గా మారింది.

రేవంత్ - కోమటిరెడ్డి ఆత్మీయ భేటీతో

రేవంత్ - కోమటిరెడ్డి ఆత్మీయ భేటీతో


టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతల చేపట్టిన సమయం నుంచి కోమటిరెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. పలు సందర్భాల్లో రేవంత్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రాహుల్ జోడో యాత్ర హైదరాబాద్ చేరుకున్నా...కోమటిరెడ్డి హాజరు కాలేదు. కాంగ్రెస్ కు సహకరించాలంటూ ఫోన్..రాజగోపాల్ రెడ్డి గెలుస్తారంటూ ఆస్ట్రేలియాలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కాంగ్రస్ నాయకత్వం వెంకటరెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కు మాణిక్కం ఠాకూర్ స్థానంలో కొత్తగా
మాణిక్ రావు ఠాకూర్ వచ్చారు. తొలి సారి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో గాంధీ భవన్ కు తాను రాలేనంటూ ఎమ్మెల్వే క్వార్టర్స్ లో కొత్త ఇంఛార్జ్ తో భేటీ అయ్యారు.

బాధ్యతల నిర్వహణలో కోమటిరెడ్డి

బాధ్యతల నిర్వహణలో కోమటిరెడ్డి


ఆ సమయంలోనే తనకు ఇచ్చిన నోటీసులు చెత్త బుట్టలోకి వెళ్లాయని వ్యాఖ్యానించారు. రేవంత్ పైన పలు సందర్భాల్లో కోమటిరెడ్డి వైఖరి పార్టీలో వివాదాస్పదంగా మారాయి. పార్టీ సీనియర్లు కూడా రేవంత్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రధానితో భేటీ తరువాత అసలు కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా.. బయటకు వెళ్తారా అనే చర్చ సాగింది. ఇప్పుడు కొత్త ఇంఛార్జ్ గాంధీ భవన్ కు వచ్చిన సమయంలో సడన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ప్రత్యక్షం అయ్యారు. కొత్త ఇంఛార్జ్ ఆహ్వానంతోనే తాను వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొంటానని ప్రకటించారు. తాను ఎప్పుడూ గాంధీ భవన్ కు రానని చెప్పలేదన్నారు.

కాంగ్రెస్ మార్క్ రాజకీయం

కాంగ్రెస్ మార్క్ రాజకీయం


గాంధీ భవన్ లో రేవంత్ - కోమటిరెడ్డి కలిసి మాట్లాడుకోవటం.. రహస్యాలు చెప్పుకోవటం.. ఒకరి చేతులో మరొకరు చేతులు వేసి హామీలు ఇచ్చుకోవటంతో చూస్తున్న కాంగ్రెస్ నేతలకు ఏం జరుగుతుందో అంతు చిక్కలేదు. సీనియర్లు ఏ నిర్ణయం తీసుకున్నా..తన మద్దతు ఉంటుందని చెప్పిన కోమటిరెడ్డి ఇప్పుడు సడన్ గా రేవంత్ తో చేతులు కలపటం వారికి షాకింగ్ గా మారింది. కోమటిరెడ్డి సడన్ డెసిషన్ తో ఇప్పుడు సీనియర్లు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోది. అటు పార్టీ అధినాయకత్వానికి రేవంత్ - కోమటిరెడ్డి ఒకరి పై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటం..ఇలా గాంధీ భవన్ లో చేతుల కలపటంతో తెలంగాణ కాంగ్రెస్ లో అసలైన రాజకీయం గాంధీ భవన్ వేదికగా కంటిన్యూ అవుతోంది.

English summary
TPCC Chief Revanth Reddy and MP Komati Reddy join hands in Gandhi Bhavan lead to big disucssion in congress politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X