తిరిగి కాంగ్రెస్ గూటికేనా?: కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికెళ్లిన రేవంత్ రెడ్డి, కీలక మంతనాలు
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్య నేతలందరితోనూ భేటీ అయ్యారు. అంతేగాక, పలువురు మీడియా అధినేతలను కూడా కలిశారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్, జూనియర్, కొత్త, పాత అనే తేడా లేకుండా అందరు నాయకులను కలుపుకుపోతున్నారు. ఇంటి దొంగలను వదిలిపెట్టనంటూనే.. పార్టీలోకి వచ్చేవారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలను కలిసిన రేవంత్ రెడ్డి.. తాజాగా చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

కొండాతో తాజా రాజకీయ పరిస్థితిపై రేవంత్ చర్చలు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలువురు రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయినప్పటికీ.. ఇంత వరకు ఏ పార్టీలోనూ చేరలేదు.

కొండా విశ్వేశర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారా?
ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికే రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఇంటికి వెళ్లారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రేవంత్ రెడ్డి రెడ్డి ఆహ్వానిస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాము రాజకీయాల కంటే రాష్ట్ర సమస్యలపైనే చర్చించామని రేవంత్ చెప్పారు. కృష్ణా జలాలు, నిరుద్యోగం లాంటి సమస్యలపై చర్చించామన్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తొలుత టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. గత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ ఇమడలేకపోయారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరలేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి భేటీ కావడంతో విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరుద్యోగ దీక్ష, నిరసనల్లో తాను కూడా పాల్గొంటానని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications