వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BRS: బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా..! పేరు మార్పుపై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి..

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన కొద్ది రోజులకే ఆ పార్టీ పేరు మార్పుపై వివాదాలు చెలరేగాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మారుస్తూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో టీఆర్ఎస్ బంగారు కూలీ పేరుతో నిధులు సమకూర్చుకున్న అంశంపై ఈసీ రేవంత్ ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్ లేఖ

ఎన్నికల కమిషన్ లేఖ


దానిపై విచారణ జరపాలని అప్పుడే అప్పుడే ఆదాయపు పన్ను శాఖకు ఎన్నికల కమిషన్ లేఖ పంపింది. ఈ విషయంపై విచారణ చేయకముందే పేరు మార్పుపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.

డిసెంబర్ 8న

డిసెంబర్ 8న


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌) పేరును భారత్‌‌‌‌ రాష్ట్ర సమితి (బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌)గా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 8న గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. కాగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరును బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మారుస్తూ అక్టోబర్‌‌‌‌ 5న పార్టీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంతో పాటు సీఈసీకి కేసీఆర్‌‌‌‌ రాసిన లేఖను ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బి. వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌, పార్టీ జనరల్‌‌‌‌ సెక్రటరీ ఎం. శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి అందజేశారు.

తాత్కాలిక ఆఫీసు

తాత్కాలిక ఆఫీసు


టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ పేరును బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చడంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నవంబర్‌‌‌‌ 7న పబ్లిక్‌‌‌‌ నోటీస్‌‌‌‌ జారీ అయింది. ఆ గడువు డిసెంబర్ 7తో ముగిసింది. దీంతో పార్టీ పేరు మార్పుకు సీఈసీ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. డిసెంబర్ 14న ఢిల్లీలో తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ జాతీయ స్థాయి తాత్కాలిక ఆఫీసును ప్రారంభించారు.

మాజీ సీఎం అఖిలేష్

మాజీ సీఎం అఖిలేష్

సర్దార్ పటేల్ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బీఆర్ఎస్ ఆఫీస్‌ని పండితులు, ఇతర పార్టీల నేతల సమక్షంలో ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ సతీమణి శోభమ్మ, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

English summary
A few days after TRS became BRS, controversies erupted over the party's name change. TPCC Chief Revanth Reddy went to the Delhi High Court over the change of name of TRS to BRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X