హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాలనను చూస్తే తుగ్లక్ పాలన అనాలో, మరేమి అనాలో అర్ధం కావడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టకుండా ప్రాజెక్టులను వివాదాస్పదం చేయడం, ఇతర పార్టీలకు చెందిన వారిని దూషించడం తప్ప ఆయన చేసేందేమి లేదని మండిపడ్డారు.

తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయవద్దంటూ బుధవారం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ వద్ద జరిగిన రాజీవ్ రహదారి దిగ్భంద కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తోటపల్లి రిజర్వాయర్‌ పనులు ప్రారంభించి 500 కోట్లు ఖర్చు చేసి కాలువలు తవ్విన తర్వాత ప్రాజెక్టుని రద్దు చేయాలనుకోవడం మంచిపద్ధతి కాదని అన్నారు.

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఎట్టి పరిస్ధితల్లోనూ రిజర్వాయర్ పని పూర్తి చేయాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో ప్రజలు చేసే అందోళనలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రాణహిత-చెవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడి వచ్చిన తర్వాత, ప్రాజెక్టు నిర్మాణ స్ధలాన్ని మార్చాలంటున్నారని మండిపడ్డారు.

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఇక ఎటువంటి పాలనా అనుమతులు లేని పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం శంకుస్థాపన చేశారని తెలిపారు. ప్రాజెక్టులన్నింటినీ ముఖ్యమంత్రి వివాదాస్పదం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

 ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

తెలంగాణ వస్తే తమకు మరింత మెరుగైన జీవితం వస్తుందని ప్రజలు ఆశించారని, ప్రస్తుతం అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వాపోయారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతే ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు.

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, పరామర్శించి ఆదుకుంటే, ఈ ముఖ్యమంత్రికి సోయి లేదని విమర్శించారు. లక్షల ఎకరాల్లో అకాల వర్షాలతో పంటనష్టం జరిగినా తెలంగాణ రైతులకు ఒక్క రూపాయైునా ఇవ్వలేదని మండిపడ్డారు.

 ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకే ఒక కుటుంబం సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు.

 ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

సీఎం కేసీఆర్‌ పెట్టుబడి దారులకు, పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టే కుట్రలో భాగంగానే తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేస్తున్నారని శాసనసభా పక్ష ఉప నేత టీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

సీఎంకి ఏ ప్రాజెక్టును కూడా నిర్మించే చిత్తశుద్ధి లేదని, ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు కింద 1800 ఎకరాల ముంపు ఉన్నదని, దానిని ఇతర ప్రాంతానికి తరలించాలని చూస్తున్నారన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు వారం రోజుల్లో పరిహారం చెల్లిస్తామని గతేడాది కేసీఆర్ ప్రకటిస్తే, నా నియోజక వర్గంలో పరిహారం ప్రకటించడానికి సీఎం ఎవరని కేటీఆర్ అనడంతో ఏడాదిగా అక్కడి నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

 ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు

రూ. 15కే చౌక మద్యం అమ్మి ప్రజలను తాగుబోతులుగా చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినా వ్యవసాయ విధానాన్ని ప్రకటించలేని దౌర్భాగ్య స్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని మాజీ మంత్రి డీ శ్రీధర్‌బాబు విమర్శించారు.

English summary
TPCC Chief Uttam Kumar Reddy arrested at Karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X