రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..!?
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం పైన పార్టీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి. వీటి పైన రాష్ట్ర ఇంఛార్జ్ నుంచి ఏఐసీసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారు. ఆ తరువాత పార్టీ నిర్ణయం పైన స్పష్టత రానుంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని పలు మార్లు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన కంటే జూనియర్ల కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సీఎం రేవంత్ పైన చేసిన వ్యాఖ్యల పైన పార్టీలో చర్చ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా, ఈ విషయం పైన టీపీసీసీ క్రమిశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు.

మల్లు రవి తాజా వివాదం పై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడనున్నారు. ఆయన స్పందనకు అనుగుణం గా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఒక దశలో రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డితో మల్లు రవి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శల గురించి మల్లు రవి వివరణ కోరనున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. పార్టీ పరువును దిగజార్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయానికి రానుంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications