వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Revanth Reddy: హిమాచల్ ప్రదేశ్‍లో కాంగ్రెస్ విజయంపై రేవంత్ రెడ్డి హర్షం..

|
Google Oneindia TeluguNews

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 68 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 40, బీజేపీ 25, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్ ఆప్ ఖాతా తెరవలేదు. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.

ట్వీట్

ఈ ఎన్నికల్లో విజయం సాధించడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

అత్యుత్తమ పాలన

అత్యుత్తమ పాలన

అద్భుతమైన విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా బాగా కృషి చేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు అత్యుత్తమ పాలనను అందజేస్తుందని అన్నారు. ప్రజల జీవితాల అభివృద్ధికి కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.

గుజరాత్ లో మా

గుజరాత్ లో మా


కాగా గుజరాత్ లో మాత్రం కాంగ్రెస్ ఓడిపోయింది. మొత్తం 180 సీట్లకు గాను బీజేపీ 156 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 17 చోట్ల విజయం సాధించగా.. ఆప్ 5 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 3 చోట్ల జయకేతనం ఎగరేశారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల బీజేపీ లాభపడినట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాజీనామా

రాజీనామా


హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై జైరాం ఠాకూర్‌ గెలుపొందారు.

 హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చత్తీస్ గఢ్ తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చత్తీస్ గఢ్ తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి


హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చత్తీస్ గఢ్ తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా ఉండేందుకు పార్టీ తమ ఎమ్మెల్యేలను చండీగఢ్ మీదుగా - అది అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌కు మార్చనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

English summary
Congress won the Assembly elections in Himachal Pradesh. Congress won 40 seats in Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X