Revanth Reddy: పొంగులేటి వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తాం: రేవంత్ రెడ్డి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి సిద్ధాంతం మంచిదేనని తెలిపారు. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. తాను కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతోంది.

తెలంగాణ ద్రోహులకే పదవులు

తెలంగాణ ద్రోహులకే పదవులు

అమరవీరుల కుటుంబాలకు అనుమతి లేని ప్రగతిభవన్ ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకే మంత్రివర్గంలో 90 శాతం పదవులు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. అధికార పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. రైతులకు రుణ మాఫీ ఎందు చేయాలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకూ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు.

ప్రగతి భవన్ పై సంచలన వ్యాఖ్యలు

ప్రగతి భవన్ పై సంచలన వ్యాఖ్యలు

కాగా రేవంత్ రెడ్డిపై తాజాగా ఓ కేసు నమోదు అయింది. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తు బీఆర్ఎస్ నేతలు రేవంత్ పై ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ములుగు జిల్లాలో హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో రేవంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

గడీలను గ్రనైడ్ లతో పేల్చినట్టే

గడీలను గ్రనైడ్ లతో పేల్చినట్టే

సామాన్య ప్రజలు ప్రగతి భవన్ లోపలికి వెళ్లడానికి కూడా అనుమతి లేదన్నారు. అలాంటి ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చివేయాలంటూ మాట్లాడారు. ఆనాడు గడీలను గ్రనైడ్ లతో పేల్చినట్టే.. ఇప్పుడు ప్రగతి భవన్ ని కూడా పేల్చివేయాలంటూ కామెంట్స్ చేశారు. రూ.2000 కోట్లతో 120 గదులతో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకున్నారని, సామాన్య ప్రజలు ఎవరూ ప్రగతి భవన్ కు వెళ్లే అవకాశం లేదన్నారు రేవంత్. ఏపీ పెట్టుబడిదారులను మాత్రమే ప్రగతి భవన్ లోకి అనుమతిస్తున్నారని అన్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజలకు అనుమతి లేని ప్రగతి భవన్ మనకు అవసరమా అంటూ కామెంట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డిపై ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+