T Congress యూత్ ఛార్జ్ షీట్ - బీఆర్ఎస్ పాలనలో ఇదీ జరిగింది..!!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటుగా ఏ వర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా మోసపోయిందీ వివరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా యూత్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. విద్యకు చేసిన కేటాయింపులు..యువతకు ఇచ్చిన హామీల విషయంలో బీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధానంగా పది అంశాలను ఈ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా కొనసాగిస్తోంది. మహిళలు, రైతులకు సంబంధించి ప్రధానంగా ఎన్నికల ప్రచార సభల్లో హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు యువత బీఆర్ఎస్ హాయంలో ఏ విధంగా నష్టపోయిందీ వివరిస్తూ..వారి మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా యూత్ చార్జ్ షీట్ ను విడుదల చేసింది. అందులో 2014 తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులను వివరించింది. 2014-15 బడ్జెట్ లో విద్యా రంగానికి 10.89 శాతం నిధులు కేటాయిస్తే క్రమేణా తగ్గిస్తూ 2023-24 బడ్జెట్ అంచనాల్లో 7.6 శాతానికి తగ్గించారని కాంగ్రెస్ వివరించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల వైఫల్యం గురించి ప్రస్తావించింది.

2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ పైన హామీ ఇచ్చారు. కానీ, గడిచిన 9 ఏళ్ల కాలంలో కొత్తగా ఒక్క తరగతి గది కూడా నిర్మించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. గంభీరావు పేటలో కేజీ టు పీజీ సంస్థ నిర్మించినా..అది సీఎస్ఆర్ నిధులతో జరిగిన నిర్మాణంగా పేర్కొంది. ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో యవతకు అబద్దాలు చెప్పారని ఆరోపించింది. బిశ్వాల్ నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖల్లో దాదాపు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి. 60 శాతం ఉద్యోగులతో నడుస్తున్న ఈ ప్రభుత్వం 60 శాతం సర్కార్ గా ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పేర్కొంది. 2014-21 మధ్య కాలంలో దాదాపుగా 3,600కు పైగా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఛార్జ్ షీటలో వివరించారు.
ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2/3 వంతు అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా.. ప్రభుత్వ ప్రయివేటు యూనివర్సిటీలను ప్రోత్సహించిందని ఇందులో వివరించారు. 2012-13 మధ్య కాలంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వివాదాలు లేకుండా 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేసారు. 2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి నెరవేర్చలేదని విశ్లేషించింది. దీని ద్వారా ఒక్కో ఉద్యోగికి రూ 1,74,928 చొప్పున బాకీ పడిందని వివరించారు. బీఆర్ఎస్ అసమర్ధ పాలన కారణంగా యువత మద్యం, జూదం, డ్రగ్స్ కు బాసిన అయి వారి భవిష్యత్ నాశనం అవుతోందని కాంగ్రెస్ విడుదల చసిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications