వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది కూడ లంచమే, రాష్ట్ర ఖజనా నుండి బహుమతులా: మల్లు

తెలంగాణ మంత్రి కెటిఆర్‌పై పీసీసీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌పై పీసీసీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రులు, కార్యదర్శులకు మంత్రి కేటీఆర్ వస్త్రాలు పంపడం లంచం కిందికే వస్తుందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

కాంట్రాక్టర్లు కూడ పనులు చేయించుకుని ఇలాగే బహుమతులు ఇస్తారని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. శుక్రవారం నాడు మల్లు భట్టి విక్రమార్క
మీడియాతో చిట్‌చాట్ చేశారు. లంచం ఇచ్చినా తీసుకున్నా చెప్పుతో కొట్టమని సీఎం కేసీఆర్ చెబుతున్నారని మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు.

TPCC working president Mallu Bhatti vikramarka slams on KTR


ఇలా బహుమతుల రూపంలో లంచం ఇచ్చేవారిని ఏం చేయాలని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా నుంచి బహుమతులు ఎలా ఇస్తారని భట్టివిక్రమార్క ప్రశ్నించారు.

కేంద్రం ప్రవేశపెట్టాలని భావిస్తున్న జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు విక్రమార్క. జీఎస్టీతో రాష్ట్రాలు కేంద్రం వద్ద మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు.

సాగర్ కట్టిన స్థలం తప్పయితే...సరైన స్థలంలో కేసీఆర్ మరో ప్రాజెక్టు కట్టొచ్చునని మల్లు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కొత్తదని ప్రజలకు చెబుతున్నారని, సంస్థలు, వ్యవస్థలకు కాళేశ్వరం పాత ప్రాజెక్టేనని చెబుతున్నారని, తాము ప్రారంభించిన ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే తాము చాలా ముందుంటామని, నల్గొండ ఉప ఎన్నికపై స్పష్టత లేదని భట్టివిక్రమార్క పేర్కొన్నారు..

English summary
Telangana Pcc president Mallu Bhatti Vikramarka made allegations Telangana minister KTR . Mallu chit chat with media on Friday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X