హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు నగరానికి రాష్ట్రపతి: ట్రాఫిక్ ఆంక్షలు, సిటీ రోడ్లపై అర్ధరాత్రి మందకృష్ణ హంగామా, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

World Telugu Conference : నగరానికి రాష్ట్రపతి: అర్ధరాత్రి మందకృష్ణ హంగామా అరెస్ట్

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ముగిసేంత వరకు ప్రత్యేకంగా 3500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.

తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత, తెలుగు మహాసభల బహిష్కరణకు పిలుపు, మందకృష్ణ మాదిగ మిలియన్‌ మార్చ్‌, వారం రోజుల వ్యవధిలో నగరంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలివి. మహాసభల సందర్భంగా ప్రముఖులు, విదేశీ అతిథులు రావడంతో ఎక్కడికక్కడ భద్రతను పటిష్టం చేశారు.

 ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.

ఎ.ఆర్‌.పెట్రోల్‌ పంపు నుంచి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వరకు రోడ్డును మూసివేయనున్నారు. ఆబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వాహనాల రాకపోకలను అనుమతించరు. బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి ఆబిడ్స్‌ పోస్టాఫీస్‌ వైపు వెళ్లే వాహన చోదకులు బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, కింగ్‌కోఠి మీదుగా వెళ్లాలి.

* పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వెళ్లే వాహనదారులు హిమాయత్‌నగర్‌ వైజంక్షన్‌ మీదుగా వారి గమ్యస్థానాలను చేరుకోవాలి. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వెళ్లేవారు హిమాయత్‌నగర్‌ మీదుగా వెళ్లాలి.

 మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు

మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు

మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 3.40 గంటల వరకు బేగంపేట విమానాశ్రయం-శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌-బేగంపేట పై వంతెన- గ్రీన్‌ల్యాండ్స్‌-మోనప్ప ఐలాండ్‌- రాజ్‌భవన్‌, సాయంత్రం 4.35 గంటల నుంచి 5.15 రాజ్‌భవన్‌-షాదాన్‌ కళాశాల-పాత సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్- రవీంద్రభారతి- పాత పోలీస్‌ కంట్రోల్‌రూం- లాల్‌బహదూర్‌ క్రీడా ప్రాంగణం, సాయంత్రం 5.45 గంటల నుంచి 6.25 లాల్‌బహదూర్‌ క్రీడా ప్రాంగణం- ఎ.ఆర్‌.పెట్రోల్‌ పంప్‌- రవీంద్రభారతి-డీజీపీ కార్యాలయం, సంత్‌ నిరంకారీ-ఖైరతాబాద్‌ కూడలి- రాజ్‌భవన్‌, బుధవారం (20.12.17) (రాష్ట్రపతి హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించనున్న నేపథ్యంలో) బుధవారం ఉదయం 9.45 గంటల నుంచి 11.15 రాజ్‌భవన్‌-ఖైరతాబాద్‌ పైవంతెన- నెక్లెస్‌రోటరీ- ఎన్టీఆర్‌ మార్గ్‌-లుంబినీ పార్కు- తెలుగుతల్లి విగ్రహం..రెండువైపులా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. .

 నిరసనలు ఆందోళనలపై అప్రమత్తం

నిరసనలు ఆందోళనలపై అప్రమత్తం

తెలుగు మహాసభలను బహిష్కరించాలని, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిరసనలు వ్యక్తం చేయాలంటూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుపై పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మహాసభల ముగింపు వేదికైన లాల్‌బహదూర్‌ క్రీడా ప్రాంగణం, రవీంద్ర భారతి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. లాల్‌ బహదూర్‌ క్రీడా ప్రాంగణం, ఆబిడ్స్‌ వైపు కొన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. క్రీడాప్రాంగణం చుట్టూ మెరుపు దళాలను సిద్ధం చేశారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ ఆందోళనలు నిర్వహించనున్నారో అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

 మందకృష్ణ అరెస్ట్

మందకృష్ణ అరెస్ట్

మంగళవారం రాత్రి వేళ ఒక్కసారిగా మందకృష్ణ మాదిగ.. ఎమ్మార్పీస్‌ కార్యకర్తలు చేపట్టిన మిలియన్‌ మార్చ్‌తో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే అప్రమత్తమై భారీగా నష్టం జరక్కుండా జాగ్రత్తపడ్డారు. మందకృష్ణతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నగరానికి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ముగిసేంత వరకు ప్రత్యేకంగా 3500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మందకృష్ణ మాదిగ మిలియన్‌ మార్చ్‌ సంఘటన నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడే ప్రాథమిక వివరాలను తెలుసుకొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిర్వాహకులదే బాధ్యత అంటూ లిఖిత పూర్వకంగా సంతకాలు తీసుకొంటున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతున్న దృష్ట్యా లాల్‌బహదూర్‌ క్రీడా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

 29వరకు మందకృష్ణ రిమాండ్

29వరకు మందకృష్ణ రిమాండ్

మందకృష్ణ మాదిగను హైదరాబాద్‌ పోలీసులు సోమవారం రాత్రి జైలుకు తరలించారు. ఆయనతో పాటు ఎమ్మార్పీఎస్‌ నాయకులు లలితా మాధవి, రాగడి సత్యం మాదిగ, కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి మిలియన్‌ మార్చ్‌ పేరుతో చలో ట్యాంక్‌బండ్‌ పేరుతో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై నిరసనలు వ్యక్తం చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించగా వారిపై దాడికి దిగారు. ఒక పెట్రోలింగ్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. సిఖ్‌విలేజ్‌, ప్యారడైజ్‌ చౌరాస్తాల వద్ద ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు పోలీసులను తోసుకెళ్లి ట్యాంక్‌బండ్‌ వైపు పరుగులు పెట్టారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞాలు అమల్లో ఉండటంతో పోలీసులు మంద కృష్ణ మాదిగతో పాటు 128 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి వేర్వేరు ఠాణాలకు తరలించారు. విధ్వంస సంఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలను గుర్తించి మందకృష్ణ మాదిగ, మరో 11 మందిపై కార్ఖానా, రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్లల్లో 8 కేసులు నమోదు చేశారు. సోమవారం ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు. రాత్రి 8.30గంటలకు వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని సికింద్రాబాద్‌ 11 ఎసీ ఎంఎం కోర్టు న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు. గంటసేపు విచారణ అనంతరం ఈనెల 29 వరకూ జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో కార్ఖానా పోలీసులు రాత్రి 10గంటల ప్రాంతంలో వీరందరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

English summary
The Hyderabad traffic police has ordered certain restrictions on the movement of vehicles to regulate traffic for the visit of President Ram Nath Kovind on December 19 and 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X