రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం.. ఇద్దరు మృతి !
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు వరంగల్‌కు చెందిన మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన రెండు కుటుంబాలు కలిసి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాయి. మార్గం మధ్యలో సిద్దిపేట వద్ద ఉన్న రంగనాయక సాగర్ వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఆగారు. ఈ క్రమంలోనే మిరాజ్, అర్బాస్ ఈతకొట్టేందుకు దిగారు. అయితే ఊహించని రీతిలో ఒక్కసారిగా లోతైన నీటిలోకి వెళ్లడంతో మిరాజ్ మునిగిపోగా.. ఆమెను కప్అదే ప్రయత్నంలో అర్బాస్ సైతం గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

కొద్దిసేపటికి మిరాజ్ మృతదేహాన్ని వెలికితీశారు. అర్బాస్ కోసం గాలింపు కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అర్బాస్ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చిన్నారుల మరణవార్తతో ఇరు కుటుంబాల్లో తీవ్రవిషాదం నెలకొంది.
ఇక కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో సైతం నదిలో స్నానానికి వెళ్ళిన ముగ్గురు బాలురు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. చనిపోయిన ముగ్గురు అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. శ్రీరామ నవమి పండుగ పూట ఆనందంగా గడపాల్సిన చిన్నారుల అలా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications