బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీలో తోపులాట.. విషాదం; ఒకరు మృతి!!

ప్రతి సంవత్సరం మృగశిర కార్తే సమయంలో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో చేప ప్రసాదం కోసం ప్రజలు వస్తారు. ఇక ఈ ఏడాది హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో జనాలు చేప ప్రసాదం కోసం ఎగబడుతున్నారు.

చేప ప్రసాదం పంపిణీలో తోపులాట
మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న చేపమందు పంపిణీ కార్యక్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చేప ప్రసాదం కోసం ప్రజలు పోటెత్తిన క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన 57 సంవత్సరాల రాజన్న అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు.

Tragedy in bathini brothers fish medicine distribution in nampally exhibition grounds

తోపులాటలో స్పృహ తప్పిన రాజన్న.. ఆస్పత్రిలో మృతి
ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్ లో నిలుచున్న సదరు వ్యక్తి ఒక్కసారిగా రద్దీ పెరిగి జరిగిన తోపులాటలో స్పృహ కోల్పోయారు.
వెంటనే స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించారు. రాజన్న కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాజన్న కుటుంబంలో చేప ప్రసాదం పంపిణీ విషాదం నింపింది.

చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు వస్తానని తెలిసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో జనాలు వచ్చే చేప మందు పంపిణీ కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 1200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.

అన్ని ఏర్పాట్లు చేసినా చేప ప్రసాదం పంపిణీలో విషాదం
ఇక రెండు లక్షల చేప పిల్లలను కూడా చేప ప్రసాదానికి అందుబాటులో ఉంచారు. జనాలు చేప ప్రసాదం క్యూ లైన్లలో తీసుకోవటానికి బారికేడ్లుఏర్పాటు చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చేప ప్రసాదం వితరణ సమయంలో జరిగిన తోపులాటలో ఒక వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+