భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. నార్సింగి మండలం పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండస్తుల ఓ భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మహిళలు సహా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్లు అక్కడకు చేరుకున్నారు.

ఏం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలోని ఓ రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతిచెందారు. భవనంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న లంగర్ హౌస్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మొదటి అంతస్తులోని ఓ గదిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని అత్యంత కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు.అయితే.. వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతులను సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మంటలు ఎందుకు వ్యాపించాయనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురిని కాపాడారు.భవనంలో మూడు గ్యాస్ సిలిండర్ల పేలడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది.
"శుక్రవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ పాషా కాలనీలోని మిస్టర్ ఉస్మాన్ అనే వ్యక్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆయన తన ఇంట్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ప్లోర్ లోని కిరాణా దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం" అని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications