జియోకు షాక్: 15 రోజుల గడువు పొడిగింపు కుదరదన్న ట్రాయ్, ఆఫర్ నిలిపివేత?
ఇప్పటివరకు ఉచిత ఆఫర్లతో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియోకు తాజాగా ట్రాయ్ చుక్కలు చూపించింది.15 రోజుల పాటు ఉచిత ఆఫర్ పొడిగింపును వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ:ఇప్పటివరకు ఉచిత ఆఫర్లతో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియోకు తాజాగా ట్రాయ్ చుక్కలు చూపించింది.15 రోజుల పాటు ఉచిత ఆఫర్ పొడిగింపును వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. ఈ ఆఫర్ల కారణంగా ప్రత్యర్థి కంపెనీలు భారీగానే నష్టపోయాయి.
రిలయన్స్ కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లను మార్చేసుకొన్నాయి. రిలయన్స్ జియో తరహలోనే టారిఫ్ ను అమలు చేస్తున్నాయి. కొన్ని స్వల్ప మార్పులతో ప్లాన్లను అమలు చేస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.
అయితే రిలయన్స్ జియో జూన్ వరకు కూడ సమ్మర్ స్పెషల్ ఆపర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.అయితే ఇప్పటివరకు జియో అమలు చేసిన ఉచిత ఆఫర్ల పట్ల ట్రాయ్ సానుకూలంగానే స్పందించినప్పటికీ 15 రోజుల పాటు ఉచిత ఆఫర్ ను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

15 రోజుల గడువును వెనక్కు తీసుకోవాలని ట్రాయ్ ఆదేశం
రిలయన్స్ జియోకు ట్రాయ్ భారీ షాక్ ఇచ్చింది. 15 రోజుల పాటు జియో ప్రైమ్ మెంబర్ షిప్ లో చేరేందుకు గడువును ఏప్రిల్ 15వ, తేదికి పొడిగిస్తూ తీసుకొన్న నిర్ణయంపై ట్రాయ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని జియోకు ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్.

15 రోజుల పాటు ఎందుకు గడువు పొడిగించారంటే?
ఈ ఏడాది మార్చి31వ, తేది వరకే నిజానికి రిలయన్స్ జియో ఉచిత సేవలు ఉండేవి.అయితే మార్చి 31వ, తేదిన కస్టమర్లు పెద్ద ఎత్తున ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవడానికి రావడంతో సర్వర్లు డౌన్ అయ్యాయి.దీంతో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవడానికి ఏప్రిల్ 15వ, తేది వరకు గడువును పొడిగిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

ట్రాయ్ ఆదేశాలను గౌరవిస్తామన్న జియో
ట్రాయ్ ఆదేశాలను గౌరవిస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ మేరకు జియో ప్రకటన విడుదల చేసింది.ట్రాయ్ ఏ ఆదేశాలను ఇచ్చిందో ఆ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని జియో ప్రకటించింది. ఉచిత ఆఫర్లతో అదరగొట్టింది.కాని, తొలిసారిగా ఉచిత ఆఫర్లకు ట్రాయ్ నుండి ఎదురు దెబ్బతగిలింది.దీంతో ట్రాయ్ ఆదేశాలను గౌరవిస్తామని జియో ప్రకటించింది.

ఆఫర్ ను నిలిపివేయనున్న జియో
సమ్మర్ స్పెషల్ సర్ ప్రైజ్ ఆఫర్ ను నిలిపివేస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో ఈ ఆఫర్ ను వెనక్కు తీసుకోనున్నట్టు రిలయన్స్ ఓ ప్రకటననను విడుదల చేసింది.ట్రాయ్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు జియో ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ ను ఇప్పటివరకు తీసుకొన్న వారికి మూడు మాసాల పాటు రిలయన్స్ జియో సేవలను అందించనున్నట్టు ప్రకటించింది.అయితే కొత్తవారికి మాత్రం ఈ సేవలు అందుబాటులో ఉండవు.












Click it and Unblock the Notifications