నెలరోజులు రైళ్ల సేవలు బంద్.. వివరాలివే!

దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కాజీపేట, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్‌, సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నెలరోజుల పాటు రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో వీటిని నిన్నటి నుంచి నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించి తిప్పుతున్నారు. సాంకేతిక సమస్యలు ఏమిటనే వివరాలు ప్రకటించనప్పటికీ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. బాలాసోర్ వద్ద జరిగిన కోరమాండల్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సిగ్నలింగ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఆధునికీకరిస్తున్నారు.

రద్దైన రైళ్ల వివరాలు

17003 కాజీపేట-కాగజ్‌నగర్ రైలును ఈ నెల 17 నుంచి జులై6 వరకు రద్దు చేశారు.
12757/58 కాగజ్‌న గర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను రెండు వైపులా ఈ నెల 23 నుంచి జులై 6 వరకు రద్దు చేశారు.
12967 చైన్నై-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 23,25,30 , జులై 2,7 తేదీల్లో రద్దు.
12968 జైపూర్‌-చెన్నై జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 21,23,28,30 , జులై 5న రద్దు.
12975 మైసూర్‌-జైపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఈనెల 27,29,జులై 4,6 తేదీల్లో రద్దు.
12539 యశ్వంత్‌పూర్‌-లక్నో ఈ నెల 26, జులై 3న రద్దు.
12540 లక్నో-యశ్వంత్‌పూర్‌ ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు.

trains cancelled one month details here
12577 భాగ్‌మతి-మైసూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఈ నెల 28 , వచ్చే నెల 5న రద్దు.
22619 బిలాస్‌పూర్‌-త్రివేండ్రం తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 25, జులై 2 రద్దు.
22620 త్రివేండ్రం- బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23,30 తేదీల్లో రద్దు.
22352 పాటలీపుత్ర-శ్రీమాత వైష్ణో ఈ నెల 21, 28 , జులై 5 తేదీల్లో రద్దు.
22352 శ్రీమాతా వైష్ణో- పాటలీపుత్ర ఈ నెల 24, జులై 1,8 తేదీల్లో రద్దు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+