వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: సచివాలయం కింద గుప్త నిధులు.. రంగంలోకి నిజాం వారసులు.. రేవంత్ రెడ్డి.. తొండ వల్ల..

|
Google Oneindia TeluguNews

చారిత్రక భవనమైన తెలంగాణ సచివాలయం 'జీ బ్లాక్' కింద గుప్త నిధులు ఉన్నాయనే వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. సచివాలయం కిందున్న నిజాం ఖజానాను కొట్టగొట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయగా.. సాక్ష్యాత్తూ నిజాం నవాబు వారసులే ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆ భవంతికి సంబంధించిన ఆసక్తికర విషయాలెన్నో బయటపెట్టారు. రేవంత్ వ్యాఖ్యలపైనా నిజాం వారసులు స్పందించారు.

సీఎం కేసీఆర్ కు చెంచాలు.. మమతతో కలిసి శ్రీనివాస్ గౌడ్ స్వీట్స్ ఏంటి? బ్రోకర్లంటూ జగ్గారెడ్డి సంచలనం.సీఎం కేసీఆర్ కు చెంచాలు.. మమతతో కలిసి శ్రీనివాస్ గౌడ్ స్వీట్స్ ఏంటి? బ్రోకర్లంటూ జగ్గారెడ్డి సంచలనం.

ఆ జర్నలిస్టు చొరవతో..

ఆ జర్నలిస్టు చొరవతో..

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమైనప్పటి నుంచి నిజాం ఖజానాపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆరో నిజాం నిర్మించిన ‘జీ బ్లాక్' భవంనం(అప్పట్లో సైఫాబాద్ ప్యాలెస్) కింద నేలమాళిగలు ఉన్నాయని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించిందని, వాటి అన్వేషణ కోసం అనుమతి కోరగా కేసీఆర్ సర్కార్ నిరాకరించిందని, ఈ మేరకు గుప్త నిధుల అంశంపై అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి కొన్ని ఆధారాలను బయటపెట్టడంతో ఖజానాపై చర్చ తారా స్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై నిజాం వారసులతో మాట్లాడి, ‘మా హైదరాబాద్ టెలీమీడియా' ఎడిటర్ శ్రీధర్ ధర్మాసనం ఓ కథనాన్ని రాశారు. తెలంగాణ సర్కిళ్లలో ఇప్పుడీ కథనం వైరల్ అయింది.

సవతి కొడుకుతో గర్భం.. ఆపై వివాహం.. సోషల్ మీడియా స్టార్ మెరీనా సంచలనం.. కరోనాకు దీటుగా ట్రెండ్..సవతి కొడుకుతో గర్భం.. ఆపై వివాహం.. సోషల్ మీడియా స్టార్ మెరీనా సంచలనం.. కరోనాకు దీటుగా ట్రెండ్..

గుప్త నిధులు ఉన్నాయా?

గుప్త నిధులు ఉన్నాయా?


ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడైన ‘నవాబ్ నజఫ్ అలీ ఖాన్'.. ప్రస్తుతం కొనసాగుతోన్న వివాదంపై స్పందించారు. నిజాం నవాబు ఎంతో ఇష్టపడి కట్టించిన ‘సైఫాబాద్ ప్యాలెస్' తర్వాతికాలంలో సచివాలయంగా ఎందుకు మారిందో, దాని కింద గుప్త నిధుల మాటేంటో సమగ్రంగా వివరించారు. ‘‘వేసవి విడిది కోసం మా తాతగారు.. హుస్సేన్ సాగర్ పక్కనే సైఫాబాద్ ప్యాలెన్ కట్టించారు. కానీ ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం నాడు.. లోపలికి అడుగుపెట్టగానే ఆయనకు ఓ తొండ ఎదురుపడింది. తొలిరోజే తొండ కనిపించడాన్ని ఆయన అపశకునంగా భావించారు. అందుకే ఏ వేసవిలోనూ అక్కడ వెళ్లలేదు. కాలక్రమంలో ఆ ప్యాలెస్ ను జాబ్-ఏ-హుకూమత్(సచివాలయం)గా మార్చేశారు. ఆ భవంతి కింద గుప్త నిధులు ఉన్నాయనే మాట వట్టి ట్రాష్. ఎందుకంటే..

ముస్లిం రాజులకు అలవాటులేదు..

ముస్లిం రాజులకు అలవాటులేదు..

నిజాం ఒక్కరేకాదు.. భారతదేశంలో పరిపాలన చేసిన ముస్లిం రాజులు ఎవరకీ గుప్త నిధులు దాచే అలవాటు లేనేలేదు. భూమిని తప్ప ఇతర ఆస్తులేవీ కూడబెట్టుకోవడం, రహస్యంగా దాచుకోవడం మహా పాపమని ఖురాన్ లో స్పష్టంగా రాసుంది. కాబట్టే ముస్లిం రాజులు ఫారో చక్రవర్తుల మాదిరగా ఖాజానాలు దాచుకోలేదు. నిజానికి ధనాన్ని జనానికి పంచడంలో నిజాం నవాబుది ప్రత్యేక చరిత్ర. చైనాతో యుద్ధం సమయంలో మా తాతగారు ఐదు టన్నుల బంగారాన్ని కేంద్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అలాంటిది, సైఫాబాద్ ప్యాలెస్ కింద గుప్త నిధులు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పడం చాలా దారుణం..''అని నవాబ్ నజఫ్ అలీ ఖాన్ వివరించారు. నిజాం వారసుడి హోదాలో ఎన్నో ట్రస్టులను నిర్వహిస్తోన్న ఆయన, హైదరాబాద్ హెరిటేజ్ పర్యవేక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు.

రేవంత్ రెడ్డి.. చరిత్ర చదువుకో..

రేవంత్ రెడ్డి.. చరిత్ర చదువుకో..


సచివాలయం భవంతి కింద నిజాం ఖజానా ఉందన్న దానిపై వివరణ ఇస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిజాం మనవడు నజఫ్ అలీ ఖాన్. రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా నిజాం ప్రతిష్టకు భంగం కలిగించారని, సొమ్ములు దాచుకున్నారని చెప్పడం ద్వారా ముస్లింల మనోభావాలను గాయపర్చారని అన్నారు. కేసీఆర్ తో విభేధాలు ఉంటే నేరుగా తేల్చుకోవాలేగానీ, నిజాం నవాబు పేరుమీద మకిలి రాజకీయాలు తగదని, నిజాం గురించిగానీ, ఇంకెవరిగురించైనా మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి ఒక్కసారి చరిత్ర చదువుకోవాలని నజఫ్ అలీ మండిడ్డారు. అంతేకాదు..

Recommended Video

Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
క్షమాపణ చెప్పకుంటే చాలా దూరం..

క్షమాపణ చెప్పకుంటే చాలా దూరం..

‘‘ప్రపంచంలోకెల్లా విలువైన వజ్రాల్లో ఒకటి ‘జాకబ్ డైమండ్'. దాన్ని మా తాతగారైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన టేబుల్ మీద పేపర్ వెయిట్ లాగా వాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయి. తన మాటలకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయబోము. నిజాం పాలించిన 16 జిల్లాల్లో(ఇప్పుడు మూడు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నాయి) ఆయనపై కోర్టు కేసులు వేస్తాం. ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేస్తాం'' అని నజఫ్ అలీ తెలిపారు. నిజాం వారసుల స్పందనపై రేవంత్ రెడ్డి స్పందించాల్సి ఉంది. ఇక, సచివాలయం కూల్చివేత పనుల్లో నిబంధనలు పాటించలేదంటూ పీఎల్ విశ్వేశ్వరావు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు చెప్పింది. భవంతి కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేయడంతో హైకోర్టు స్టే ఎత్తేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి కూల్చివేత పనులు పున:ప్రారంభం అయ్యాయి. ఇదే ప్రదేశంలో రూ.500 కోట్లతో కొత్త సచివాలయం కడతామని కేసీఆర్ సర్కారు ప్రకటించడం తెలిసిందే.

English summary
Congress MP Revanth Reddy’s remarks against KCR for demolishing the Secretariat has come under sharp criticism from none other than the Nizam’s Grandson Nawab Najaf Ali Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X