పీవీకి ఘన నివాళి, హాజరు కాని కేసీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 94వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు.

కేసీఆర్‌ మాత్రం కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇటు గాంధీ భవన్‌లోనూ టీపీసీసీ, ఏపీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

దేశ రాజకీయాల్లో పీవీ నరసింహారావు అపార అనుభవం కలిగిన అద్భుత పండితుడని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పీవీ సేవలను ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.

భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంత్రిగా ఆయన్ని అభివర్ణించిన చంద్రబాబు, దేశంలో ఎకనమిక్ పాలసీలను తెచ్చారని ట్విట్టర్ ద్వారా కొనియాడారు. గొప్ప రాజకీయ వేత్తగా, స్కాలర్‌గా ఎల్లప్పుడూ మా హృదయాల్లో నిలిచే ఉంటారని ట్వీట్ చేశారు.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు. విజ్ఞాని, సమాజసేవకుడు'' అని దిగ్విజయ్‌సింగ్‌ కొనియాడారు. అలాంటి గొప్ప నేతతో కలిసి పని చేసే అవకాశం తనకు దక్కిందంటూ గుర్తు చేసుకున్నారు.

పీవీకి ఘన నివాళి DSC_0199.JPG

పీవీకి ఘన నివాళి DSC_0199.JPG


అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ మైనారిటీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిన ఘనత పీవీకే దక్కుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


పీవీ జయంతి సందర్భంగా టీపీసీసీ, ఏపీసీసీ నేతలు ఒకే వేదికపైకి రావడం సంతోషకరమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

పీవీకి ఘన నివాళి DSC_0007.JPG

పీవీకి ఘన నివాళి DSC_0007.JPG

సామాన్య కుటుంబంలో పుట్టిన పీవీని ముఖ్యమంత్రి, ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పిస్తున్న సి.రామచంద్రయ్య.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పిస్తున్న వి.హన్మంతరావు.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులర్పిస్తున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులర్పిస్తున్న ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులర్పిస్తున్నఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులర్పిస్తున్న తెలంగాణ మంత్రి టి.హరీశ్‌రావు.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులర్పిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పిస్తున్న తెలంగాణ మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.

పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేకే మహేందర్ రెడ్డి.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పిస్తున్న తెలంగాణ స్పీకర్ మధుసూదనా చారి.

 పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి


హైదరాబాద్‌లోని పీవీఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పిస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+