వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లో మరో వికెట్ డౌన్ - రేవంత్ ఉక్కిరి బిక్కిరి : ఢిల్లీ లో ఏం జరుగుతోంది..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పార్టీలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ మొదలైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యవహారం ఇంకా పార్టీలో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రస్తుతం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయని తన సన్నిహితులతో వాపోయారు.

Recommended Video

రాజగోపాల్ రెడ్డి రాజీనామా,ఎవరికి ఏ పార్టీ నచ్చితే అందులోకి మారతారు *Politics |
దాసోజు శ్రావణ్ రాజీనామా వెనుక

దాసోజు శ్రావణ్ రాజీనామా వెనుక

గత ఎన్నికల్లో దాసోజు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ కార్పోరేటర్.. పీజేఆర్ కుమార్తె తిరిగి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో పాటుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన వాపోతున్నట్లుగా సమాచారం.

అయితే, దాసోజు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారాల పైన పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారు. రేవంత్ సామాజిక వర్గాల వారీగా కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల సమయం నుంచి శ్రవణ్ కొంత మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తరువాత, శ్రవణ్ సైతం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

అమిత్ షాతో రాజగోపాల్ భేటీ

అమిత్ షాతో రాజగోపాల్ భేటీ

వరుసగా పార్టీ వీడుతున్న నేతలు.. పార్టీలోని కొందరు టార్గెట్ చేస్తుండటంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఉక్కపోత తప్పటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. రేవంత్ కు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన సమయం నుంచి కొందరు సీనియర్లు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు.

హైకమాండ్ జోక్యంతో ఒక్కొక్కరుగా దగ్గరవుతున్న వేళ..ఇప్పుడు సడన్ గా పార్టీలో పరిణామాలు మారిపోతున్నాయి. బీజేపీ యాక్టివ్ కావటంటో టీఆర్ఎస్ పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్న వేళ..అనూహ్యంగా కాంగ్రెస్ లో వేగంగా సమీకరణాలు మారిపోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పరిస్థితి ఇలా ఉంటే..అటు ఢిల్లీలోనూ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వేడి కొనసాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అంశం సైతం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణహవుతోంది.

టార్గెట్ రేవంత్ రాజకీయాలు

టార్గెట్ రేవంత్ రాజకీయాలు

రాష్ట్రంలో వరదల పరిస్థితి పైన వివరించి..నిధులు మంజూరు చేసేందుకే తాను అమిత్ షా ను కలుస్తున్నట్లుగా కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ, ప్రస్తుత పరిణామాల్లో ఈ భేటీ పైన ఆసక్తి నెలకొని ఉంది. మరో వైపు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి సైతం అమిత్ షా తో భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశం పైన చర్చించినట్లుగా తెలుస్తోంది.

అధికారికంగా బీజేపీలో చేరే అంశం పైనే ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. మనుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని..ఆ సభలో రాజగోపాల్ అధికారికంగా కాషాయం కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు.

ఆ సభకు కేంద్రం నుంచి కీలక నేత వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో చేస్తున్న రాజకీయం..అటు మునుగోడు లో సభ.. మరో వైపు హైదరాబాద కేంద్రంగా రాజీనామాలు ఇప్పుడు టీ కాంగ్రెస్ లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

English summary
Congress official representative Dasoju Sravan decided to resign congress, Komatireddy Raja Gopal Reddy met Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X