బాబు వ్యూహమే: కేశినేని, టీడీపీకి టీఆర్ఎస్ షాక్.. ఎవరిని అడిగి అవిశ్వాసం పెట్టారు
Recommended Video

అమరావతి/హైదరాబాద్: అవిశ్వాస తీర్మానంపై చర్చను శుక్రవారం టీడీపీ ఎంపి కేశినేని నాని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎంపీలకు కావాల్సిన సమాచారాన్ని ఏపీ అధికారులు పంపించారని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు చక్కని వ్యూహంతో నడిపించారన్నారు. అవిశ్వాసంపై చర్చకు ఆమోదం తెలపడం తెలుగు ప్రజల విజయమన్నారు.
చదవండి: అలా అని ఎవరు చెప్పారు?: టీడీపీ అవిశ్వాసంపై సోనియా, '20న సత్తా చూపిస్తాం'
ఏపీకి న్యాయం చేయాలని తాము చేస్తున్న పోరాటానికి ఇది నిదర్శనం అన్నారు. కేంద్రం ఏపీకి మొండి చేయి చూపడంతో తాము పోరాట బాట పట్టామని చెప్పారు. మూడు రోజులుగా చక్కని వ్యూహంతో చంద్రబాబు తమను నడిపించారని ఆయన వ్యాఖ్యానించారట. టీడీపీ ఎంపీలు బృందాలుగా విడిపోయి పార్టీల మద్దతు కూడగట్టడం మొదలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఆమోదించడం వరకు ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు.
చదవండి: నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?

మొత్తం 14 అంశాలపై మాట్లాడుతాం
అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని టీడీపీ ఎంపీ కేశినేని నాని బుధవారం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం సహా మొత్తం 14 అంశాలపై మాట్లాడుతామని తెలిపారు.

ఏపీపై ప్రధాని మోడీ చిన్నచూపు
అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఎక్కువ సమయం కేటాయించాలని మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీనే సమాధానం చెప్పాలన్నారు. మేం మూడు నెలలుగా ధర్మపోరాటం చేస్తుంటే ప్రధాని మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీపై ప్రధాని చిన్న చూపు చూస్తున్నారన్నారు.

టీడీపీ అవిశ్వాసంతో మాకు సంబంధం లేదు
తెలుగుదేశం పార్టీ అవిశ్వాసంతో తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పారు. కానీ అవిశ్వాసం ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఎవరిని అడిగి పెట్టారని టీడీపీకి గట్టి షాకిచ్చారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని చెప్పారు.

అవిశ్వాసానికి తెరాస, బీజేడీ మద్దతిచ్చే అవకాశం లేదు
ప్రతి బిల్లుపై మా అభిప్రాయాలు, సూచనలు అందజేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. హైకోర్టు విభజన అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. హైకోర్టు విభజన చేస్తామని గత సమావేశాల్లోనే హామీ ఇచ్చారని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంటుపై సెయిల్ నివేదిక సానుకూలంగా ఉన్నట్లుగా లేదన్నారు. కాగా, టీఆర్ఎస్ మాత్రమే కాకుండా అన్నాడీఎంకే, బీజేడీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే అవకాశాలు లేవు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications