ఊచలు లెక్కబెట్టినా తోక వంకరే: మళ్లీ అమ్మాయిలపై కార్పొరేటర్ తనయుడి వేధింపులు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మహిళలు, విద్యార్థినులను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధించి ఓసారి జైలుకు వెళ్లొచ్చినా అతని వక్రబుద్ధి మారలేదు. 'లైవ్‌ చాటింగ్‌ చేయి.. లేదంటే నీ సంగతి చూస్తా' అంటూ వాట్సప్‌లో అసభ్యకర ఫొటోలు పంపుతూ మళ్లీ దొరికిపోయాడు. జీహెచ్ఎంసీ మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్ గౌడ్. బాధితుల ఫిర్యాదు మేరకు అతన్ని రాచకొండ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరి కార్పొరేటర్‌ జగదీశ్‌గౌడ్‌ కొడుకు అభిషేక్‌గౌడ్‌ జల్సాలకు అలవాటుపడ్డాడు. జులాయిగా తిరిగే అభిషేక్‌ ఫేస్‌బుక్‌లో అమ్మాయిలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి స్నేహితునిగా మాట్లాడుతాడు. వారి ఫొటోలు, సెల్‌నంబర్లు సేకరించిన తర్వాత విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. వారి ఫోన్ నంబర్లకు ఇంటర్నెట్‌ కాలింగ్‌ ద్వారా వేధిస్తున్నాడు.

సెప్టెంబర్‌లో వేధింపుల కేసులోనే అరెస్ట్

సెప్టెంబర్‌లో వేధింపుల కేసులోనే అరెస్ట్

'నాతో నువ్వు సెక్స్‌ చాట్‌ చేయాలి. లేదంటే నీ నగ చిత్రాలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తా' అని బెదిరిస్తున్నాడు. లేదంటే మార్ఫింగ్‌ చేసిన నగ చిత్రాలను యువతుల వాట్సప్‌కు పంపుతున్నాడు. నిందితుడి వేధింపులను తట్టుకోలేక కొందరు యువతులు షీ బృందాల దృష్టికి తీసుకువెళ్లడంతో సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కండీషనల్ బెయిల్‌పై బయటకు వచ్చిన అభిషేక్‌ గౌడ్‌పై సస్పెక్టివ్‌ తెరిచారు. ప్రతి వారం వచ్చి మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌లో రిజిస్ట్రర్‌లో సంతకం చేసేవాడు. ఇంత జరిగినా అతనిలో మార్పు రాలేదు. తిరిగి అమ్మాయిలను వేధించడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులకు చిక్కకుండా ఇలా

పోలీసులకు చిక్కకుండా ఇలా

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులకు చిక్కకుండా 'వరా డార్లింగ్‌' ప్రొఫైల్‌తో అభిషేక్‌ తిరిగి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచాడు. ఇంటర్‌నెట్‌ ద్వారా ఆకర్షించే ఫొటోలు పెట్టి అమ్మాయిలతో చాటింగ్‌ చేయడం ప్రారంభించి.. ఆ తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. అసభ్యకరమైన పోస్టులు, అశ్లీల చిత్రాలు పెట్టడంతో పలువురు అమ్మాయిలు చాటింగ్‌ చేయడం నిలిపేశారు. దాంతో కక్ష పెంచుకున్న అభిషేక్‌ వారి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ప్రొన్‌ వెబ్‌సైట్‌లో పెట్టాడు. దీనిపై పలువురు అమ్మాయిలు గత నెల 17న రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. నాగోల్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పీడీ యాక్టు కింద కేసు నమోదైతే 12 నెలల్లో నో బెయిల్

పీడీ యాక్టు కింద కేసు నమోదైతే 12 నెలల్లో నో బెయిల్

పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని అనుమానం రావడంతోనే తన మొబైల్ ఫోన్‌లోని డేటా అంతా డిలిట్ చేసేశాడని అరెస్ట్ చేసిన తర్వాత గుర్తించారు. మరో ప్రొఫైల్ పేరుతో మెసేజ్ లు పంపుతున్నట్లు విచారణలో అంగీకరించాడు. నిందితుడిపై ఐపీసీలోని 292, 201, 354 డీ, 507 సెక్షన్లు, ఐటీ చట్టంలోని 66 సీ, 66 ఈ, 67, 67 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అభిషేక్ గౌడ్ విషయమై హైదరాబాద్ నగర పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ) కింద కేసు నమోదు చేస్తామని రాచకొండ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తే కనీసం 12 నెలల్లోపు నిందితుడికి బెయిల్ దొరకదని స్పష్టం చేశారు.

ఫిర్యాదు వాపస్‌ తీసుకోకపోతే అంతే..

ఫిర్యాదు వాపస్‌ తీసుకోకపోతే అంతే..

గతంలో అభిషేక్‌గౌడ్‌ను హైదరాబాద్‌ షీ బృందాలు, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో నిందితుడిపై ఆరుగురు యువతులు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌గా తండ్రి జగదీశ్వర్ గౌడ్ అధికారం అండతో బాధితులను బెదిరించడంతో వారిలో చాలా మంది ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారని చెప్తున్నారు. కానీ నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఐద్వా నాయకులు శారద డిమాండ్‌ చేశారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతా రహితంగా ఉండడంతోనే మగపిల్లలు ఇలా తయారవుతారని అన్నారు. పిల్లల విషయంలో బాధ్యత లేని తండ్రి డివిజన్‌ కార్పొరేటర్‌గా, నాయకుడిగా ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరగని ఎడల ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Cybercrime Police of Rachakonda on Saturday arrested N. Abhishek Goud, son of the TRS corporator from Malkajgiri, N Jagadeeshwar Goud. After the arrest, the police found that Abhishek Goud had deleted all the data in his mobile phone and had destroyed the device having come to know that a case has been registered against him. Police managed to identify the account as being operated by Abhishek Goud and based on a tip-off he was traced to Nagole crossroads on Friday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి