బీజేపీ నేతల్ని ఉరికిస్తాం.. గల్లాపట్టి నిలదీస్తాం.. ధాన్యం కొనుగోళ్లలో వెనక్కి తగ్గేదేలే : టీఆర్ఎస్

తెలంగాణలో వడ్ల రాయకీయం మరింత హీటెక్కింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో తప్పు మీదంటే మీదంటూ ఆరోణలు గుప్పించుకుంటున్నారు.

నిరసనలతో హోరెత్తిన తెలంగాణ

నిరసనలతో హోరెత్తిన తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా, మున్సిపల్, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పలు చోట్ల కల్లాల వద్దే ఆందోళనలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని తమ నిరసనను తెలిపారు.

గల్లాపట్టి నీలదీస్తాం..

గల్లాపట్టి నీలదీస్తాం..


ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోదీ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. యాసంగిలో వడ్లను కొంటారో లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. గొంతెమ్మ కోర్కెలను తెలంగాణ ప్రభుత్వం కోరడంలేదన్నారు. రోజుకో మాయ మాటలు చెబుతున్న బీజేపీ నేతల్ని గల్లాపట్టి నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ధాన్యం కొంటారా లేదా..

ధాన్యం కొంటారా లేదా..

పంజాబ్ లో వడ్లు కొంటున్న కేంద్రం తెలంగాణలో మాత్రం ఎందుకు కోనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. వానాకాలం, యాసంగి సీజన్ లో వచ్చే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఉచిత విద్యుత్ ఉందా అని ప్రశ్నించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెడుతామన్న కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ పై తీవ్ర ప్రభావం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 బీజేపీకి కొత్త అర్థం చెప్పిన మంత్రి

బీజేపీకి కొత్త అర్థం చెప్పిన మంత్రి

బీజేపీ అంటే బాధ్యత లేని జనతా పార్టీ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై కక్ష‌ సాధింపు సరికాదని మండిపడ్డారు. రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనకపోతే వరికి కాదు ఉరి... బీజేపీకి ఘోరీ కడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ లో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతు వ్యతిరేకి ప్రధాని మోదీ

రైతు వ్యతిరేకి ప్రధాని మోదీ

తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం విక్ష‌ ప్రదర్శిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రైతుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపుతుంటే మోదీ మాత్రం వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్నారని మండిపడ్డారు. వర ధాన్యం కొనుగోలుపై కేంద్రం వెంటనే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ నేతలకు తగిన గుణపాఠం చేప్పేందుకు తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా నినాదాలు

బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా నినాదాలు


ఇదిలా ఉంటే .. జమ్మికుంటలో టీఆర్ఎస్ , బీజేపీ నేతలు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. అదేసమయంలో అక్కడి వచ్చిన బీజేపీ నేతలు.. సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. సీఎం కేసీఆర్‌కి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరికొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త‌ వాతావరణం చోటు చేసుకుంది. వెంట‌నే పోలీసులు అక్కడకు చేరుకున్న ఇరువురిని అడ్డుకున్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+