వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్ష పార్టీలు ఎంత అరిచిన మేము పట్టించుకోము : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ప్రతిపక్షాలు ఎంత అరిచినా తాము పట్టించుకోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా అన్ని ఎన్నికల్లో గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పోరాడేందుకు సమస్యలే లేవని అన్నారు. ఈనేపథ్యంలోనే గతంలో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు కోందరు గడ్డాలు కూడ తీయమని శపథాలు చేశారని గుర్తు చేశారు. కాని చివరికి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని అన్నారు.

ఇక ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన వారికి ఎన్నికల్లో గెలుపు ద్వారనే సమాధనం చెబుతామని అన్నారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేటీఆర్ నెల రోజుల్లోనే టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటడం సంతోషకరంగా ఉందని అన్నారు.ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ తరపున రూ. 2 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. బీమా కంపెనీకి ప్రీమియం మొత్తాన్ని ఈ రోజే అందజేశామన్నారు. ఈ సంధర్భంగా రూ. 11 కోట్ల 21 లక్షల బీమా ప్రీమియం చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి కేటీఆర్ అందజేశారు.

 TRS do not care of opposition parties : KTR

మరోవైపు రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉన్నారని కేటీఆర్ పేర్కోన్నారు..

English summary
The TRS working president KTR criticised the opposition parties.they have no work to fight in Telangana.TRS is the winner in all elections he cleared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X