ఆ రాష్ట్రానికే అన్నీ.. బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రానిది సవతితల్లి ప్రేమ; వినోద్ కుమార్ నిప్పులు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2022-23 బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏ ఒక్క వర్గానికీ లాభం చేకూర్చని కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి లాభం చేకూర్చే విధంగా లేదని పేర్కొన్న ఆయన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వంటి అన్ని రంగాలలోనూ ఉద్యోగులకు, కార్మికులకు కేంద్ర బడ్జెట్ మొండిచెయ్యి చూపించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కానీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులు ప్రకటించిందని బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు.

నదుల అనుసంధానంపై డీపీఆర్ ఒక బక్వాస్
ఇక రాజ్యాంగం సమీక్ష చెయ్యాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ వాజ్ పేయి ప్రధానిగా ఉండగా రాజ్యాంగంపై సమీక్షకు 11 మందితో కమిటీని వేసిందని, రాజ్యాంగం పై సమీక్ష చేయడానికి వెంకటాచలయ్య కమీషన్ ను వేసిందని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. గోదావరి నదీ జలాలను కావేరి లోకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించిన ఆయన నదుల అనుసంధానంపై డీపీఆర్ తయారయిందని చెప్పటం బక్వాస్ అని పేర్కొన్నారు. రాష్ట్రాలతో మాట్లాడకుండా నదుల అనుసంధానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రతిష్ఠాత్మక సంస్థలన్నింటినీ గుజరాత్ కు తరలించటం దారుణం
ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్, వరల్డ్ క్లాస్ ఫారిన్ ఇనిస్ట్యూట్ లను గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్నికల్ సిటీలో స్థాపించనున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారని పేర్కొన్న వినోద్ కుమార్, ప్రతిష్ఠాత్మక సంస్థలన్నింటినీ గుజరాత్ కు తరలించటం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

దక్షిణ భారతదేశంపై కేంద్రానిది సవతితల్లి ప్రేమ
దక్షిణ భారతదేశం పై కేంద్రం సవతితల్లి ప్రేమను చూపిస్తుందని అన్నారు బోయినపల్లి వినోద్ కుమార్. బిజెపి ఉత్తర భారత దేశ పార్టీ అని బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణాదిలో పెడితే దేశం విచ్ఛిన్నం అవుతుందని గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ మాట్లాడారని బోయినపల్లి వినోద్ కుమార్ గుర్తుచేశారు. బిజెపి మాటలు నమ్మొద్దు అని కెసిఆర్ చెప్పారని, బీజేపీ నేతల రెచ్చగొట్టే మాటలను లెక్క చేయొద్దని వినోద్ కుమార్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో బుందేల్ ఖండ్ కు ప్రత్యేక హోదా కల్పించారని బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.

బుందేల్ ఖండ్ కు ప్రత్యేక హోదా .. ఎన్నికల కోసమేనా?
జాతీయ హోదా ఇచ్చే ప్రక్రియ ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ప్రకటించిన కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో బుందేల్ ఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏ విధంగా కల్పించారో చెప్పాలని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. బుందేల్ ఖండ్ రాష్ట్రానికి 49 వేల కోట్ల కేటాయింపు జరిగిందని కేవలం ఎన్నికల కోసమే ఈ స్టంట్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని కొన్ని సబ్జెక్టులపై మాత్రమే ప్రధాని అని అన్ని అంశాలలో వేలు పెట్టడానికి లేదని బోయిన పల్లి వినోద్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారని, దీనిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు బోయినపల్లి వినోద్ కుమార్.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications