ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ సభ: 11 తీర్మానాలు; కేసీఆర్ ఏం చెప్పారంటే!!
టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 27 వ తేదీతో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తవుతుంది. రెండు దశాబ్దాలు దాటి సాగిన పార్టీ ప్రయాణాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. మాదాపూర్ వేదికగా భారీగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

27వ తేదీ కార్యక్రమ వివరాలు చెప్పిన కేసీఆర్
ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించిన కెసీఆర్ 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు పార్టీ ప్రతినిధులందరూ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో చేరుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. మాదాపూర్లోని హెచ్ఐసిసిలో వేదికగా జరగనున్న వేడుకలకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. కెసిఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు పార్టీ ప్రతినిధుల పేర్లు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.

పతాకావిష్కరణ.. ఆపై కేసీఆర్ ప్రసంగం
11 గంటల 5 నిమిషాలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం స్వాగత ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. తీర్మానాలపై చర్చ జరిపి ఆపై ఆమోదించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం తోపాటు లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా ,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, డిసిసిబి, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లాల గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, మున్సిపల్ మేయర్ లు, చైర్మన్లు, జడ్పిటిసి సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల, మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు హాజరుకానున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరవుతారు.












Click it and Unblock the Notifications