• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వీడియోను పోస్ట్ చేసి దులిపేశారు: ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ వర్సెస్ కేటీఆర్

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. కేసీఆర్, తెరాస పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించగా, ప్రచారంలో కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ సెటైర్లు వేశారు.

చంద్రబాబు కూటమికి షాక్: టీఆర్ఎస్ గెలుపుకు హైదరాబాద్‌లో రంగంలోకి జనసేన, వైసీపీ!

బీజేపీ బీ టీమ్ టీఆర్ఎస్

బీజేపీ బీ టీమ్ టీఆర్ఎస్

టీఆర్ఎస్.. బీజేపీ బీ టీమ్ అని, తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ రబ్బర్ స్టాంప్ అని, మజ్లిస్ బీజేపీకి సీ టీం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వారు ముగ్గురు ఒక్కటేనని పేర్కొన్నారు. దీనిని రాహుల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో ట్వీట్ చేశారు.

'BJP `B`టీం TRS.KCR తెలంగాణ‌లో మోడీ ర‌బ్బ‌ర్‌స్టాంప్‌.
ఓవైసీకి చెందిన ఎంఐఎం బీజేపీ `C`టీంగా వ్య‌వ‌హ‌రిస్తూ BJP/TRS వ్య‌తిరేక ఓట్ల‌ను చీలుస్తోంది.
మోడీ,KCR,ఓవైసీ ఒక్క‌టే.రెండునాల్క‌ల దోర‌ణితో మాట్లాడ‌టంలో వారు ఆరితేరారు.తెలంగాణప్ర‌జ‌లు తెలివైన‌వారు.ఆ ముగ్గురి చేతిలో మోస‌పోరు!' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

టీ కాంగ్రెస్ అలా, రాహుల్ గాంధీ ఇలా

అంతకుముందు, కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో అబద్దం వెల్లడయిందంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, రాహుల్ గాంధీ మాత్రం ఓ బహిరంగ సభలో లక్ష ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో అబద్దాలు చెబుతున్నారని అభిప్రాయపడుతూ రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.

 డబుల్ బెడ్రూం ఇళ్లపై కేటీఆర్ విమర్శలు

డబుల్ బెడ్రూం ఇళ్లపై కేటీఆర్ విమర్శలు

అంతకుముందు, తెలంగాణ కాంగ్రెస్ ఇళ్లకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల ప్రచారంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మహాకూటమి ఎన్నికల హామీల పేరిట పేదలను మోసపుచ్చుతోందని చెప్పారు. స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, మిగిలినవర్గాలకు రూ.5 లక్షలు సాయంగా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌ మాట మార్చిందన్నారు. అందుకు ఆ పార్టీ ఇస్తున్న యాడ్స్ నిదర్శనం అన్నారు. ఈ మొత్తాలను రుణంగా ఇస్తామని చెబుతోందని, తద్వారా ఇళ్లకు డబ్బులు పొందిన వారు మళ్లీ వాటిని కట్టవలసి ఉంటుందన్నారు. ఆదివారం దిన పత్రికల్లో కూటమి పేరిట ఇచ్చిన ప్రకటనలను ప్రస్తావిస్తూ దగాకూటమిని నమ్మితే మోసపోతామని ప్రజలు గుర్తించాలన్నారు.

తప్పు సరిద్దిదుకున్న కాంగ్రెస్

తప్పు సరిద్దిదుకున్న కాంగ్రెస్

అయితే ఆ తర్వాత సోమవారం మళ్లీ ఆ పొరపాటును కాంగ్రెస్ పార్టీ సరిద్దుకున్నది. ఇంటి కోసం స్థలం ఉంటే డబుల్ బెడ్రూం నిర్మాణానికి పేదలకు రూ.5 లక్షలు ఇస్తామని, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని సోమవారం మరోసారి ప్రకటన ఇచ్చింది.

రాహుల్ గాంధీకి తెలుసా?

రాహుల్ గాంధీకి తెలుసా?

మరో ట్వీట్‌లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకు రావడంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాహుల్ గాంధీకి తెలుసా అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తద్వారా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను ప్రయివేటు సెక్టార్‌లో సృష్టించిన విషయం తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు దీనిని ఆపేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
స్ట్రైక్ రేట్
AIMIM 100%
AIMIM won 1 time since 2014 elections

English summary
'TRS is the BJP's "B" team & KCR operates as Mr Modi's, Telangana Rubber Stamp. Owaisi's, AIMIM is the BJP's "C" team, whose role is to split the anti BJP/ KCR vote. Great people of Telangana, Modi, KCR & Owaisi are one. They speak in twisted tongues. Do not be fooled by them!' AICC president Rahul Gandhi tweet.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more