టిఆర్ఎస్ మైండ్ గేమ్, వేధింపులు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మైండ్ గేమ్ ఆడుతోందని బిజెపి తెలంగాణ జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారంనాడు పార్ట కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్‌లో చేరకపోతే నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయబోమని, కేసులు పెడతామంటూ బెధిరింపులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్‌లో చేరకుంటే నియోజకవర్గం నిధులను మంజూరు చేయకుండా ఆపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.

తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయంపై త్వరలో తాము గవర్నర్ నరసింహన్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఈ అంశంపై అవసరమైతే టిఆర్ఎస్‌పై ఉద్యమం చేస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు కృష్ణా జలాల వినియోగంలో ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించాలని కిషన్ రెడ్డి సూచించారు. సున్నితమైన అంశాలను జఠిలం చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. నాగార్జన సాగర్ వివాదంపై స్పందించారు. సాగర్ డ్యామ్‌పై పోలీసులకు పనేముందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత రాష్ట్ర గవర్నర్‌పై ఉందన్నారు.
నాగార్జున సాగర్ జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించే విధంగా చంద్రబాబు, కెసిఆర్ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications