బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రాజ్యాంగంపై చర్చ పెట్టాలి: బీజేపీపై గులాబీనేతల రివర్స్ ఎటాక్

రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు తీసుకురావాలి అనేది తెలంగాణ సీఎం అభిమతమని, ఇందులో రాజ్యాంగ నిర్మాతను అవమానించింది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ సీఎం కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలపై, తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీనేతలపై ఎదురుదాడికి దిగారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు.

దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోంది: గువ్వల బాలరాజు

దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోంది: గువ్వల బాలరాజు

దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోందని తెలంగాణ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆరోపించారు. దళితుల సంక్షేమానికి కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న కృషిపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక చర్చ జరగాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాల హయాంలో దళితులకు ఎలాంటి న్యాయం జరగలేదని, అభివృద్ధి జరగలేదని అందుకే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

బిజెపి ప్రభుత్వానికి దమ్ముంటే రాజ్యాంగంపై చర్చ పెట్టాలి: గువ్వల సవాల్

బిజెపి ప్రభుత్వానికి దమ్ముంటే రాజ్యాంగంపై చర్చ పెట్టాలి: గువ్వల సవాల్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు దళితుల సంక్షేమం అంటూ కాలయాపన చేస్తున్నారని గువ్వల బాలరాజు వెల్లడించారు. బిజెపి ప్రభుత్వానికి దమ్ముంటే రాజ్యాంగంపై చర్చ పెట్టాలి అని సవాల్ విసిరారు. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత కూడా బడుగు బలహీనవర్గాల జీవితాల్లో ఎందుకు మార్పు రాలేదని గువ్వల బాలరాజు ప్రశ్నించారు. ఈరోజు అంబేద్కర్ ని అవమానించిన వారే అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారని, బడ్జెట్ అందరినీ అవమానపరిచే విధంగా ఉందని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తోందని గువ్వల బాలరాజు విమర్శించారు.

 రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల విమర్శలు: గువ్వల బాలరాజు

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల విమర్శలు: గువ్వల బాలరాజు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడూ భారత రాజ్యాంగం గురించి మాట్లాడలేదని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగుతోందని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పనిచేస్తుందని, అవసరమైతే కేంద్రం పై ఉద్యమం చేస్తామని గువ్వల బాలరాజు వెల్లడించారు. రాజ్యాంగ హక్కులకు లోబడి ముఖ్యమంత్రి చక్కగా మాట్లాడారని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. అవగాహన లేమి కారణంగానే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆరోపణలు గుప్పించారు.

 కొత్త రాజ్యాంగం అవసరం అని కేసీఆర్ చెప్పింది ఇందుకే అన్న పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

కొత్త రాజ్యాంగం అవసరం అని కేసీఆర్ చెప్పింది ఇందుకే అన్న పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

బీజేపీ ప్రభుత్వంపై, బీజేపీ నేతల తీరుపై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో రైతులు, దళితుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. కేంద్ర బడ్జెట్ లో రైతుల కోసం, దళితుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రైతు బంధు, దళిత బంధు పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే కొత్త రాజ్యాంగం అవసరం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి వెల్లడించారు.

Recommended Video

    Retired Judge B. Chandra Kumar Exclusive Interview జడ్జిలకి అదొక పెద్ద ఛాలెంజ్ | Oneindia Telugu
     దళితులను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

    దళితులను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

    అలాగే ప్రభుత్వ రంగ విభాగాలను పరిరక్షించాలంటే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ చెప్పారని జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో జై భీమ్ నినాదాలు చేస్తూ ఎన్నికల తర్వాత దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లూ ఇలాగే దళితులను మోసం చేస్తున్నారని అన్నారు. దళితుల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని తేల్చి చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+