కేటీఆర్ మామ ఇష్యూ: 'పిచ్చికుక్క రేవంత్ చీకటి బాగోతాలు చాలా ఉన్నాయి, మళ్లీ జైలుకెళ్తావా'

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే వంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంపీలు బాల్క సుమన్, మండలి ప్రభుత్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు.

ప్రజాసమస్యలు, ప్రభుత్వ పథకాలపై కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధమని, వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

కుక్కలా, గజ్జికుక్కలకు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది

కుక్కలా, గజ్జికుక్కలకు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది

ప్రజాసమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే తాము కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా విమర్శలు చేయగలమన్నారు. కానీ అది తమది ఆ సంస్కృతి కాదన్నారు. రేవంత్ రెడ్డీ.. నువ్వో రవ్వంత అన్నారు. కొండంత కేసీఆర్‌పై రవ్వంత రేవంత్ విమర్శలు చేస్తే ఎలా అన్నారు. ప్రచారం కోసమే కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ కుక్కలాగా మొరుగుతున్నాడని, గ్రామాల్లో పిచ్చికుక్కలు, గజ్జికుక్కలకు పట్టినగతే ఆయనకూ పడుతుందన్నారు.

మళ్లీ జైలుకు వెళ్లాలని ఉందా

మళ్లీ జైలుకు వెళ్లాలని ఉందా

గతంలో జైలుకెళ్లిన రేవంత్ రెడ్డికి మళ్లీ అక్కడకు వెళ్లాలని ఉందా అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కేటీఆర్ మామకు ఉద్యోగం వచ్చినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో తెలుసుకుని మాట్లాడాలని, నాడు కేటీఆర్ పుట్టనేలేదన్నారు. కేటీఆర్ మామ ఉద్యోగానికి, కేసీఆర్ కుటుంబానికి ముడిపెట్టడం చూస్తుంటే పీర్ల పండుగకు శంకరాచార్యుల వారిని పిలిచినట్టే ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కులం, మతంపై విమర్శలు చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

రేవంత్ పిచ్చి ప్రేలాపనలు మానుకో

రేవంత్ పిచ్చి ప్రేలాపనలు మానుకో

రేవంత్ ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే ఆయన నోటిని ప్రజలు ఫినాయిల్‌తో కడగాల్సి వస్తుందన్నారు. అంతర్జాతీయవాదినని చెప్పుకొనే జైపాల్ రెడ్డి ఏనాడైనా తెలంగాణ ఉద్యమం గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

తలవంచి ఇచ్చింది

తలవంచి ఇచ్చింది

కేసీఆర్ దీక్షతోనే డిసెంబర్ 9వ తేదీకి ప్రాధాన్యం అన్నారు.
తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన ఫలితంగానే 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలపై ప్రేమతో రాష్ట్రం ఇవ్వలేదని, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమానికి తలవంచి ఇచ్చిందన్నారు.

రేవంత్ మాయలో పడి ఇజ్జత్ తీసుకుంటున్నారు

రేవంత్ మాయలో పడి ఇజ్జత్ తీసుకుంటున్నారు

డిసెంబర్ 9 చారిత్రకదినం అంటూ గాంధీ భవన్ సాక్షిగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రకటనను వెనకకు తీసుకున్న డిసెంబర 23ను విద్రోహదినంగా జరిపే దమ్ముందా ప్రశ్నించారు. . 2001 ఏప్రిల్ 27న తెరాసను స్థాపించిన కేసీఆర్ పదవులను గడ్డిపోచలా త్యజించి వదిలేశారని, అలు పెరగని పోరాటం సాగించారన్నారు. తెలంగాణ కోసం రాజీనామా కూడా చేయని రేవంత్ మాయలోపడి కాంగ్రెస్ నాయకులు ఉన్నకొద్ది ఇజ్జత్ కూడా తీసుకుంటున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు.

రేవంత్ చీకటి బాగోతాలు చాలానే ఉన్నాయి

రేవంత్ చీకటి బాగోతాలు చాలానే ఉన్నాయి

రాజకీయంగా ఎదుర్కొనే లేకనే రేవంత్ లాంటి సన్నాసి కేసీఆఱ్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం ప్రతి సన్నాసికి ఫ్యాషన్ అయిపోయిందన్నారు. కేటీఆర్ మామకు కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగం వచ్చిందని, అఫ్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రేవంత్ చీకటి బాగోతాలు చాలా ఉన్నాయని, కానీ తాము దిగజారమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+