బీఎస్పీ మీటింగ్‌కి వెళ్లవద్దు..వెళ్తే పరేషాన్‌లో పడుతారు :టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు ఫోన్ కాల్ లీక్
కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరుడి బెదిరింపు ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల ఆదిలాబాద్‌లో జరిగే బీఎస్పీ సమావేశానికి వెళ్లవద్దని స్థానిక వ్యాపారి ఒకరిని అతను ఫోన్‌లో బెదిరించాడు. ఒకవేళ తమ ఆదేశాలను పట్టించుకోకుండా బీఎస్పీ సమావేశానికి వెళ్తే పరిస్థితులు వేరే ఉంటాయని హెచ్చరించాడు. నరేందర్ గౌడ్ అనే కోనప్ప అనుచరుడు ఈ ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ ఆడియో టేపులో సంభాషణ :
'అర్షద్ వేరే పార్టీలోకి వెళ్తున్నాడు. మీ వాడ నుంచి యూత్,మీ గ్యాంగ్ పోతున్నదని తెలిసింది.ఎవరూ పోయినా కూడా... ఎమ్మెల్యే సాబ్ చెప్పేసిండు... తొక్కేసుడే ఉంటది.మీకు మంచిగా చెబుతున్నా.పరిస్థితి ఇట్లా ఉన్నదని చెప్పు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే బలంతోని అర్షద్‌ది నడిసింది.అందరు ఆయన మాట విన్నరు. ఇప్పుడైపోయింది.. పార్టీకి రాజీనామా చేసిండు... వేరే పార్టీలో చేరుతున్నాడు. పోలీసులతో సహా అందరికీ ఎమ్మెల్యే చెప్పేసిండు.ఎవరూ పోతే వారిని తొక్కుమంటున్నాడు. మళ్లీ మీరు మా దగ్గరికి వచ్చి ఇలా అయిందని చెప్పొద్దు... అందుకే ముందే చెబుతున్నా.ఎవరినీ పోనివ్వకు.పోతే పరేషాన్‌లో పడుతారు..' అని ఆ ఫోన్ కాల్‌లో నరేందర్ గౌడ్ అనే వ్యక్తి ఎదుటి వ్యక్తిని హెచ్చరించాడు.

ప్రవీణ్ కుమార్ ఫోకస్ దాని పైనే..
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరాక ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రస్తుతం పార్టీ బలోపేతంపై ప్రవీణ్ కుమార్ ఫోకస్ చేశారు. ఇందుకోసం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యువతను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనూ త్వరలో బీఎస్పీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మాజీ టీఆర్ఎస్ నేత అర్షద్ బీఎస్పీలో చేరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోనప్ప అర్షద్ వెంట వెళ్లేవారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే నరేందర్ గౌడ్ అనే వ్యక్తి స్థానిక వ్యాపారి ఒకరికి ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రవీణ్ కుమార్...
బీఎస్పీలో చేరిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్‌లో ప్రభుత్వ విధానాలను ఆయన మరోసారి ఎండగట్టారు. 'ఓవైపు ఎస్సీ నేతలతో విందు...మరోవైపు హైకోర్టు తీర్పుకు విరుద్దంగా ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు బందు.ఇట్ల సచివాలయం కారిడార్లలో చాలా కుట్రలు-డ్రామాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కేసీఆర్ గారికి తెలవకుండా జరుగుతాయా... బహుజన ఉద్యోగులారా,ఇకనైనా కళ్లు తెరిచి కారు దిగి ఏనుగును ఎక్కి పాలకులు అవండి.' ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్లు పొందిన ఎస్సీ,ఎస్టీలకు కాన్ సీక్వెన్షియల్ ప్రమోషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఇలా స్పందించారు.
Recommended Video

ప్రవీణ్ కుమార్‌పై గోనే ప్రకాశ్ రావు విశ్లేషణ...
తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల ఐక్యతతో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ విశ్లేషకులు,మాజీ మంత్రి గోనే ప్రకాశ్ రావు ప్రవీణ్ కుమార్ భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలపై ప్రవీణ్ కుమార్ ప్రభావం గట్టిగానే ఉంటుందన్నారు.తనకున్న సమాచారం ప్రకారం యువత ఎక్కువ బీఎస్పీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. యూపీలో మాయావతి చేసిన సోషల్ ఇంజనీరింగ్‌ను ప్రవీణ్ కుమార్ ఇక్కడ కూడా అప్లై చేస్తే ప్రభావం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ మరో పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. బీజేపీ లేదా కాంగ్రెస్‌తో పొత్తు ఉండవచ్చు అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications