హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: కరీంనగర్ లాయర్, కేరళ డాక్టర్, తుషార్‌కు నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా, ఈ కేసులో కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పరారీలో కేరళ డాక్టర్ జగ్గుస్వామి: సిట్ నోటీసులు

పరారీలో కేరళ డాక్టర్ జగ్గుస్వామి: సిట్ నోటీసులు

కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న జగ్గుస్వామి ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే, అప్పటికే జగ్గుస్వామి పోలీసులు వస్తున్న విషయాన్ని తెలుసుకుని పరారయ్యాడు. జగ్గుస్వామి ఇంటితోపాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన హాజరుకావాలని నోటీసులో స్పష్టం చేశారు.

తుషార్, న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు

తుషార్, న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు


మరోవైపు, బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్‌కు కూడా సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఐదు రోజులపాటు కేరళలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులు హైదరాబాద తిరిగి వచ్చారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు కేరళ వెళ్లి దర్యాప్తు చేశారు.

కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కు కూడా సిట్ అధికారులు నోటీసులు పంపించారు.

ఎర కేసులో మధ్యవర్తిగా జగ్గుస్వామి

ఎర కేసులో మధ్యవర్తిగా జగ్గుస్వామి

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతికి, తుషార్‌కు మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. జగ్గుస్వామి, తుషార్ లను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరింత కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. కేసులో మరో నిందితుడు సింహయాజీ స్వామిజీకి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి న్యాయవాది శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

English summary
TRS MLAs poaching case: SIT notices to three persons, related to this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X