ఫరీదుద్దీన్ ప్రమాణం
హైదరాబాద్: శాసనమండలి సభ్యుడిగా తెరాస నేత ఫరీదుద్దీన్ గురువారం ప్రమాణం స్వీకరించారు. జూబ్లీహాల్‌లోని శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ పత్రాన్ని ఫరీదుద్దీన్‌కు అందించి ప్రమాణం చేయించారు. అనంతరం స్వామిగౌడ్ స్వాగతం పలికి, శుభాకాంక్షలు చెప్పారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావులు ఫరీదుద్దీన్‌కు శాలువా కప్పి అభినందించారు.












Click it and Unblock the Notifications