బీజేపీ నేతలకు నోటీసులు: ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ ఆరోపణలు చేయొద్దన్న కోర్టు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సిర్సాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఆమె మంగళవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.

Recommended Video

    Vijayashanti సూటిప్రశ్నలు... TRS కౌంట్ డౌన్ మొదలైంది *Telangana | Telugu OneIndia

    కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని ఢిల్లీకి చెందిన ఎంపీ పర్వేశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలను కోర్టు ఆదేశించింది.

     TRS MLC kalvakuntla kavitha defamation case on bjp leaders: court notices

    అంతేగాక, సభలు, మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ నిరాధార ఆరోపణలు చేయొద్దని స్పష్టం చేస్తూ.. పర్వేశ్ శర్మ, మజుందర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.

    కాగా, ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని, ప్రజల్లో తనకున్న ప్రతిష్టను చెడగొట్టడానికి అక్రమ పద్ధతులను వారు ఎంచుకున్నారని కవిత మంగళవారం తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులు తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కవిత కోరారు. మిగిలిన 32 జిల్లా కోర్టుల్లోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు కవిత కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కవితపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలపై టీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+