వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"ఎవడో అన్నాడని.. రేవంత్! పిచ్చికూతలు మానుకో.. జైలుకెళ్లడం ఖాయం"

ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ముందుకెళ్తున్న ఎన్డీయే.. టీఆర్ఎస్ అందుకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీఎస్టీ అమలు చేయాలన్న పట్టుదలతో ఉందని, అందువల్లే పన్నుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీఎస్టీ విషయంలోను, నోట్ల రద్దు సమయంలోను కేంద్రంతో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు పట్ల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు ఆర్థికమంత్రిని అభినందిస్తూనే.. సీఎం తీరును మాత్రం ఆయన తప్పుపట్టారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా టీఆర్ఎస్ నుంచి కౌంటర్ పడింది.

<strong>ఈటెల నిజాలు, కేసీఆర్ అడగవేం: రేవంత్, తెలంగాణకు మోడీ నో చెప్పారు!</strong>ఈటెల నిజాలు, కేసీఆర్ అడగవేం: రేవంత్, తెలంగాణకు మోడీ నో చెప్పారు!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యానే టీఆర్ఎస్ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ముందుకెళ్తున్న ఎన్డీయే.. టీఆర్ఎస్ అందుకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీఎస్టీ అమలు చేయాలన్న పట్టుదలతో ఉందని, అందువల్లే పన్నుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.

trs mlc palla rajeswar reddy warning to revanth reddy

టీడీపీ నేతలు పిచ్చికూతలు మానుకోవాలని పల్లా రేవంత్ ను హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ను సీబీఐ విచారించిందంటూ ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆధారాలు బయటపెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద ఎవడో ఏదో అన్నాడని.. దానికి మేము స్పందించాలా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని పల్లా అన్నారు. సీఎం కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తున్నామని తెలిపారు. టీడీపీ నేతలు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీకి రాష్ట్రాల వారీగా విధానాలుంటాయా? అని నిలదీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన మేరకే ప్రధాని మోడీ రాష్ట్ర అభ్యర్థిగా కోవింద్ ను ఎంపిక చేశారు.

English summary
TRS MLC Palla Rajeswar Reddy responded on TDP working president Revanth Reddy allegations on CM KCR. Rajeswar slams Revanth on his false allegations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X