మరో షాక్: కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్!, వేటు పడింది
హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ నేతల వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలను ఆకర్షించేందుకు అధికార పార్టీ జోరుగా ప్రయత్నాలు చేస్తుండగా.. అధికార పార్టీలోని అసంతృప్త నేతలను గాలం వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ బీజేపీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా పార్టీ మారుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయింది.

గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జీ కుంతియాను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరినట్లు సమాచారం.
ఇల్లందులో రాములు నాయక్ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇది ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం అందడంతో టీఆర్ఎస్.. రాములు నాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, సోమవారం సాయంత్రంలోగా రాములు నాయక్ పార్టీ మార్పుపై ప్రకటన చేయనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications