జాగృతి తల్లిగారిల్లు.. టీఆర్ఎస్ అత్తగారిల్లు.. : ఎంపీ కవిత సరదా వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ఏర్పాటుతో తెలంగాణ ఆడపడుచుల్లో ప్రత్యేక ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత రాజకీయాల్లోను తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా తన రాజకీయాలపై సరదా వ్యాఖ్యలు చేసిన ఎంపీ కవిత.. తనకు జాగృతి తల్లి గారి ఇల్లయితే టీఆర్ఎస్ అత్తగారిల్లు లాంటిదని ఛమత్కరించారు.
తెలంగాణ ప్రజలు కూడా జాగృతి నాయకురాలిగానే తన పట్ల ఎక్కువ ఆప్యాయత కనుబరుస్తారని చెప్పారు ఎంపీ కవిత. జాగృతిలో వేరే పార్టీ నేతలున్నా తామెలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. ఇకపోతే తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన కవిత.. ఆంధ్రా పాలకుల హయాంలో ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని, ప్రొఫెసర్ కోదండరాం లాంటి మేధావులు వాటిపై అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.

ప్రాజెక్టులపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజల్లో జేఏసీ పై ఉన్న విశ్వాసం తగ్గిపోతుందన్న కవిత.. ఇదే తరహాలో వ్యవహరిస్తే జేఏసీ ని కొనసాగించడం కంటే ఓ రాజకీయ పార్టీని పెట్టుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications