హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమస్యలు తీర్చండి: మోడీతో కవిత, తెలంగాణకు స్వాగతం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పసుపు బోర్డు ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. గురువారం ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. పసుపు పంటకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మోడీని కవిత కోరారు.

TRS MP Kavitha To Meet PM Narendra Modi In Delhi

అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. గత 20ఏళ్ల నుంచి పసుపు రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. పసుపు బోర్డ్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలను తీర్చాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.

ప్రధాని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రధాని కృషి చేస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు.

మంత్రి కెటిఆర్‌తో యూకే ప్రతినిధుల భేటీ

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్‌తో యూకే బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ శాఖ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రీవ్ ఎంసీ అల్లిస్టర్ తోపాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేశంలో 'ఈజ్ అప్ డూయిండ్ బిజినెస్' అంశాన్ని యూకే ప్రతినిధులు పరిశీస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోనే పరిశ్రమలు, పెట్టుబడులకు ఉత్తమ వాతావరణం ఉందని యూకే ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

తమ దేశంలోని పెట్టుబడులను తెలంగాణకు తరలించేందుకు సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌కు యూకే ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా యూకేలోని పలు పారిశ్రామిక విధానాలను తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ ప్రతినిధులను కోరారు. యూకే ప్రతినిధుల సలహాలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

English summary
Telangana MP K Kavitha has met Prime Minister Narendra Modi in Delhi. Nizamabad MP has appealed the Prime Minister for developing a Turmeric Board in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X