ఎదుర్కోలేక నన్ను, నా భర్తను అంటావా: మధుయాష్కీకి కవిత లీగల్ నోటీసులు

నిజామాబాద్/వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ పైన తెరాస నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మండిపడ్డారు. ఆయనకు ప్రజల్లో ఆదరణ లేక, తనను, తెరాసను ఎదుర్కోలేక పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

తన మీద, రాజకీయాలలో లేని, రాజకీయాలకు సంబంధం లేని తన భర్త మీద ఆధారాలులేని, అవాస్తవ, అర్థం పర్థం లేని ప్రచారం చేస్తున్నారని, ఇది విచారకరమని చెప్పారు. మధుయాష్కీ చేసిన ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్టను, రాజకీయపరపతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి లాయర్ ద్వారా ఆయనకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు.

TRS MP kavitha sends legal notice to Madhu Yashki

మధుయాష్కీ తన పట్ల, తన భర్త పట్ల వాడిన పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+