లావోస్ పర్యటనలో థాట్ లువాంగ స్ధూపం వద్ద ఎంపీ కవిత (ఫోటోలు)
హైదరాబాద్: ఆర్ధిక ఒప్పందాలు, పౌర విమానయాన సేవలకు భారత్-లావోస్ మధ్య అంగీకారం కుదిరింది. తొలిసారా లావోస్ పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బృందానికి లావోస్‌లో ఘన స్వాగతం లభించింది.
కంబోడియా, లావోస్ పర్యనటలో భాగంగా గురువారం హమీద్ అన్సారీ బృందం లావోస్‌కు చేరుకుంది. శుక్రవారం ఆ దేశ అధ్యక్ష భవనమైన బౌన్న్‌హాంగ్ వొరాచిత్‌లో ఆ దేశ అధ్యక్షుడు, అత్యున్నత నాయకత్వంతో చర్చలు జరిపింది. అంతక ముందు హమీద్ అన్సారీ బృందం లావోస్‌లోని వియెంటైన్‌లో థాట్ లువాంగ స్ధూపాన్ని సందర్శించారు.

లావోస్ పర్యటనలో థాట్ లువాంగ స్ధూపం వద్ద ఎంపీ కవిత
లావోస్ పర్యటనలో ఆ దేశ రాష్ట్రపతి చౌమ్మలి సయసోన్, ఉప రాష్ట్రపతి బౌన్‌హాంగ్ వోరాచిట్, ప్రధాని తాంగ్‌సింగ్ తమావోంగ్‌లతో హమీద్ అన్సారీ బృందం భేటీ అయింది.

లావోస్ పర్యటనలో థాట్ లువాంగ స్ధూపం వద్ద ఎంపీ కవిత
ఈ సందర్భంగా లావోస్-భారత్‌ల మధ్య నేరుగా పౌర విమానాలు నడిపేందుకు అంగీకారం కుదిరింది. దీంతో పాటు ఆర్ధిక సంబంధిత ఒప్పందంపై ఇర దేశాలు సంతకాలు చేశాయి.

లావోస్ పర్యటనలో థాట్ లువాంగ స్ధూపం వద్ద ఎంపీ కవిత
ఇందులో పౌర విమానయాన సేవల ఒప్పందం కుదరడం ఇరు దేశాలకు ఎంతో కీలకమని, ఆగ్నేయాసియాతో సంబంధాలు పుంజుకోవడంతోపాటు ఆర్థిక బంధం బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (తూర్పు) అనిల్ వాధ్వా మీడియాకు చెప్పారు.

లావోస్ పర్యటనలో థాట్ లువాంగ స్ధూపం వద్ద ఎంపీ కవిత
లావోస్‌లో పర్యటించిన ప్రతినిధి బృందంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు ఉన్నారు.

లావోస్ పర్యటనలో థాట్ లువాంగ స్ధూపం వద్ద ఎంపీ కవిత
నాలుగు రోజుల పర్యటనను ముగించుకుని ఉప రాష్ట్రపతి అన్సారీ బృందం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకుంది. కంబోడియా, లావోస్ దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరితంగా బలోపేతం చేసేందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు ఐదుగురు ఎంపీలు మంగళవారం నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

లావోస్ పర్యటనలో థాట్ లువాంగ స్ధూపం వద్ద ఎంపీ కవిత
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బృందంలో ఆయన సతీమణి సల్మా అన్సారీ, కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి సన్వర్‌లాల్ జాట్, ఎంపీలు హుస్సేన్ దల్వాల్, సుఖేందు శేఖర్‌రాయ్, అజయ్ సంచేటి, ఉపరాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి, వ్యక్తిగత కార్యదర్శి తదితరులు ఈ పర్యటనకు వెళ్లారు.












Click it and Unblock the Notifications