కరెంట్ బిల్లు కట్టలేదేమో: మంత్రి బొత్స సత్యనారాయణకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి చురకలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీలో పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికార పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో నీళ్లు, కరెంట్ లేవన్న కేటీఆర్ వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలో పొలిటికల్ హీట్ పెరిగిన విషయం తెలిసిందే.

బొత్స కరెంటు బిల్లు కట్టలేదేమో..: ఎంపీ రంజిత్ రెడ్డి సెటైర్లు
ఏపీలో అధికార వైసీపీ నేతలు.. తమదైన శైలిలో మంత్రి కేటీఆర్, టీఆర్ నేతలకు విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్‌లో కరెంట్ లేదన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు చెవేళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసి ఉంటారని చురకలంటించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసినట్లు ఉన్నారు. తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదు. అరగంట లేకపోతే మనం తట్టుకోలేక పోతున్నాం. అప్పుడు ఏం ఉన్నాయో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు అని ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే అంటున్నారన్న రంజిత్ రెడ్డి
హైదరాబాద్‌లో మంచిగుందని మాకు ఫోన్ చేసి అడుగుతున్నరు. హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ నేతలను అడిగితే నిజం తెలుస్తుంది. జగన్ కుటుంబం ఇక్కడే ఉంటుంది.. వాళ్లను అడిగినా నిజం చెప్తారు. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే నాతో అన్నారు. మా పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్పడితే మీకు పాలన చేతగాదు అన్నారు. ఇప్పుడు వాళ్ల ఎంపీలే మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మాకు ఏపీతో పోటీ కానే కాదు అని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారనడం విడ్డూరమన్న ఎంపీ
తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోవడం లేదని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ నేతలను అడిగితే నిజం చెప్తారని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటుంది.. వాళ్లను అడిగినా నిజం చెప్తారన్నారు. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే నాతో అన్నారని ఎంపీ చెప్పారు. ఏపీ పథకాలు తెలంగాణలో అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications