సంతోష్ కుమార్‌కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం, కేసీఆర్‌కు అంకితం చేసిన ఎంపీ..
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రతిష్టాత్మక గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నందుకు గానూ పురస్కారం అందజేశారు. పచ్చదనం ఆవశ్యకతను చెబుతూ సంతోష్ కూమర్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు, క్రీడాకారులు, పలురంగాల ప్రముఖులు మొక్కలు నాటారు.
మహోద్యమంలా సాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.
మహాత్మాగాంధీ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ప్రతినిధులు అవార్డును ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రదానం చేశారు. సంతోష్ కుమార్‌ను సన్మానించి పురస్కారం బహూకరించారు.

గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ప్రతినిధులకు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్‌ను చేపట్టానని వివరించారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. భూమిపుత్రుడిగా గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టానని వివరించారు. దానిని మరింత ముందుకు తీసుకెళతానని చెప్పారు. పచ్చదనంతోపాటు మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని తెలిపారు. గ్రామోదయ బంధుమిత్ర అవార్డును సీఎం కేసీఆర్‌కు అంకితం చేస్తున్నట్టు సంతోష్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications