సాక్షులను బెదిరించడమే: రేవంత్ మీసాలు మెలేసి, తొడ కొట్టడంపై వినోద్
కరీంనగర్: బెయిల్‌పై చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తొడకొట్టి, మీసాలు మెలేయడం కేసులో సాక్షులను బెదిరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తమకు వ్యతిరేకంగా ఉంటే అంత చూస్తామన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరించారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా లేరని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల స్వేచ్ఛకు విఘాతం కలిగే విధంగా చంద్రబాబు రేవంత్ రెడ్డిని పావుగా వాడుకున్నారని ఆయన అన్నారు. ఈ నెల 21వ తేదీ లోపు హైకోర్టు విభజన లేకుంటే పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications