వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు.!హెచ్ఐసీసీలో కీలక సమావేశం నిర్వహించిన కేటీఆర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బావ వేడుకలకు హెచ్ఐసీసీ మరోసారి వేదిక కానుంది. ప్లీనరీ ఏర్పాట్లు, కమిటీలు, నిర్వహణ, బాద్యతలు తదితర అంశాలు చర్చించేందుకు మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కే. తారక రామారావు పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్లీనరీ సందర్భంగా నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపైన పోలీస్, ట్రాఫిక్, నగర పాలక సంస్థతో పాటు ఇతర అధికారులతో మంత్రి కేటీఆర్ చర్చించారు.

 ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్బావ సభ.. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కేటీఆర్

ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్బావ సభ.. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కేటీఆర్

బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు ఆదర్శంగా టిఆర్ఎస్ పార్టీ, చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ సాధించుకుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని, ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హెచ్ఐసీసీలో నిర్వహించపోతున్నామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ, శాసన మండలి, పార్లమెంట్ ప్రతినిధులు ఆ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలన్నారు కేటీఆర్.

 అభివృద్ధిలో తెలంగాణ ముందుకు దూసుకుపోతోంది.. హెచ్ఐసీసీలో కేటీఆర్ దిశానిర్ధేశం

అభివృద్ధిలో తెలంగాణ ముందుకు దూసుకుపోతోంది.. హెచ్ఐసీసీలో కేటీఆర్ దిశానిర్ధేశం


అంతే కాకుండా కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, సహకార బ్యాంకు అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, మహిళా కోఆర్డినేటర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మున్సిపాలిటీల చైర్మన్, మండల, పట్టణ శాఖ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారని కేటీఆర్ వివరించారు. 27వ తేదీన 10 గంటల లోపల సమావేశ ప్రాంగణానికి అహ్వానిత నాయకులు చేరుకోవాలని, 10 గంటల నుంచి 11 గంటలకు ఆహ్వానితుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు కేటీఆర్.

 సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్.. క్షేత్ర స్థాయిలో వివరించాలన్న కేటీఆర్

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్.. క్షేత్ర స్థాయిలో వివరించాలన్న కేటీఆర్

11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ జెండాను ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారని, సమావేశం 5 గంటల వరకు కొనసాగుతుందని, పార్టీ తరఫున ఆహ్వానించిన వారిని మాత్రమే అనుమతించాలని విజ్ఞప్తి చేసారు కేటీఆర్. ఇది పార్టీ ప్రతినిధుల సభ మాత్రమేనని గుర్తుంచుకోవాలని, ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ కమిటీ పార్టీ జెండాను ఎగుర వేయాలని, గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ కమిటీ సమావేశమై, తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పాలని, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ అని తెలపాలని కేటీఆర్ దిశానిర్దేశం చేసారు.

 ప్రతిగ్రామంలో గులాబీ జెండా ఎగరాలి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

ప్రతిగ్రామంలో గులాబీ జెండా ఎగరాలి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు


ప్రతి పట్టణంలో వార్డు లోనూ టిఆర్ఎస్ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో బస్తీలో జెండాలు ఎగుర వేయాలని, సమావేశానికి రాకుండా పార్టీ శ్రేణులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ సంబరాలను చేసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. ఒక పార్టీకి 21 సంవత్సరాలు నిండడం ఒక కీలకమైన మైలురాయని, ఈ నేపథ్యంలో సంబురాలను ఘనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేసారు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డు లో పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండా కార్యక్రమాలు జరగాల్సిన కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులదేనన్నారు మంత్రి.

 సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు వద్దు.. సమస్యలు తలెత్తకుండా చూడాలన్న కేటీఆర్..

సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు వద్దు.. సమస్యలు తలెత్తకుండా చూడాలన్న కేటీఆర్..

అంతే కాకుండా నగర అలంకరణకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు బాధ్యత తీసుకుంటారని, పార్టీ ఆవిర్భావ సంబరాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి వాటిలో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసారు.పార్టీ సమావేశం సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నగర పోలీసులు ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసి వంటి అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్.

English summary
HICC will once again be the venue for the Telangana Rashtra Samithi Formation celebrations. Minister, Party Working President K.T.Rama Rao held a keynote meeting with party chiefs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X