టార్గెట్ 2019: కెసిఆర్ ప్లాన్ ఇదే, సిట్టింగ్‌లకు గుబులు

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేలా టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలోని ప

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేలా టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించే అవకాశం లేకపోలేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇతర పార్టీల నుండి ముఖ్యమైన నేతలను, ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు.

అయితే 2019 ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలుంటాయనే విషయమై క్షేత్రస్థాయిలో సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించనున్నారు.

ఈ పరిణామాలు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళనలను కల్గిస్తున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కకపోవచ్చనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు


2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను గులాబీ బాస్ కెసిఆర్ సర్వే నిర్వహిస్తున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తానని కెసిఆర్ పదే పదే హమీ ఇస్తున్నారు. అయితే ఇతర పార్టీల నుండి బలమైన నేతలు చేరుతున్నారు. అయితే ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు ఆశావాహులు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. అయితే సర్వేల ఆధారంగానే టిక్కెట్లను కేటాయించనున్నట్టు టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సర్వే రిపోర్ట్ సిట్టింగ్‌లకు ఇబ్బందేనా?

సర్వే రిపోర్ట్ సిట్టింగ్‌లకు ఇబ్బందేనా?

ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై పలుమార్లు సర్వేలు నిర్వహించారు. టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశాల్లో ఈ సర్వే రిపోర్టులను స్వయంగా ఎమ్మెల్యేలకు అందించారు. ఇందులో పలువురు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకున్నా పార్టీ పట్ల సానుకూలత ఉందని సర్వే రిపోర్టుల్లో తేలింది. అప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.

నల్గొండ తరహలోనే రాజకీయ సమీకరణాల్లో మార్పులు

నల్గొండ తరహలోనే రాజకీయ సమీకరణాల్లో మార్పులు


టిడిపి నుండి కంచర్ల భూపాల్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరారు. దీంతో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి టిఆర్ఎస్ ఇంచార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డి స్థానంలో కంచర్ల భూపాల్‌రెడ్డిని నియమించారు. దుబ్బాక నర్సింహ్మరెడ్డికి నామినేటేడ్ పదవిని కేటాయించనున్నట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే తరహలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.

ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై కన్ను

ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై కన్ను

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కూడ టిఆర్ఎస్‌లో చేర్చేలా ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుందనే ప్రచారం సాగుతోంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డికి మెదక్ సీటు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. ఇక నర్సాపూర్ టికెట్‌ను కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డికి ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు ఇచ్చినా పార్టీ మారేందుకు సునీతా లక్ష్మారెడ్డి ఆలోచిస్తోందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+