నేడే టీఆర్ఎస్ ప్లీనరీ: ఫెడరల్ ఫ్రంట్‌,కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 17వ ప్లీనరీ సమావేశాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 10గంటలకు(ఏప్రిల్ 27న) హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో ఈ ప్లీనరీ ప్రారంభం కానుంది. ప్లీనరీ ప్రాంతానికి ప్రగతి ప్రాంగణంగా నామకరణంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 13 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రతినిధులకు సేవలందించేందుకు దాదాపు రెండువేల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు.

ప్లీనరీకి కేసీఆర్..

ప్లీనరీకి కేసీఆర్..

కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే ఈ ప్లీనరీ ప్రాంగణాన్ని 9 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు ప్లీనరీ వేదికకు సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్‌లను పంపిణీ చేశారు. పాస్‌ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్‌ ఫొటోతో పాటు, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటో, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగిరే టీఆర్ఎస్ జెండా చిత్రాన్ని ముద్రించారు.

వివిధ రంగుల్లో పాసులు

వివిధ రంగుల్లో పాసులు

వీవీఐపీ పాస్‌లను ఆకుపచ్చ రంగులో, ఎన్నారైలకు ముదురు గోధుమరంగులో, వీఐపీలకు కాషాయ రంగులో, మీడియా ప్రతినిధుల కోసం నీలంరంగులో, సాంస్కృతిక బృందానికి పసుపు, కాషాయం రంగులో పాస్‌లను ముద్రించారు. ప్లీనరీలో పనిచేసే వాలంటీర్లకు వారు పనిచేసే ప్రాంతాన్ని బట్టి నాలుగు రకాల పాస్‌లు ముద్రించారు.

వివిధ దేశాల నుంచి..

వివిధ దేశాల నుంచి..

కాగా, ప్లీనరీలో పాల్గొనేందుకు 24 దేశాల నుంచి సుమారు 125 మంది పార్టీ ప్రతినిధులు టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సారథ్యంలో బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళ్లు అర్పించారు. అక్కడి నుంచి ప్లీనరీ జరిగే కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. ప్లీనరీకి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రియా, బహ్రేయిన్, న్యూజిలాండ్, డెన్మార్క్, నార్వే, మలేషియా, ఫ్రాన్స్, ఖతార్, ఫిన్‌లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, జాంబియా, పెరూ, పోలాండ్, సింగపూర్, ఇటలీ, కొలంబియా, పరాగ్వే నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.

గులాబీమయమైన నగరం

గులాబీమయమైన నగరం

కాగా, ప్లీనరీ కోసం హైదరాబాద్ గులాబీమయమైంది. పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ నగరం,శివార్లలో పెద్దఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. ప్రభు త్వ పథకాలను తెలియజేస్తూ హోర్డింగులు నెలకొల్పారు. మెట్రో పిల్లర్లపై కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.

కేసీఆర్ కీలక ప్రకటన

కేసీఆర్ కీలక ప్రకటన

కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్‌పై ఈ ప్లీనరీ వేదికగా ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చెబుతారోనని రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం వివిధ పార్టీల నేతలను కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే. కాగా, ప్లీనరీ వేదిక ద్వారా ముఖ్యమైన తీర్మానాలపై చర్చించి రాష్ట్రానికి, దేశానికి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలను సన్నద్ధం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+