వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ ర‌హ‌దారుల‌పై టీఆర్ఎస్ రాస్తారోకో.. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి

|
Google Oneindia TeluguNews

కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. తెలంగాణా రైతాంగం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తుందని మండిపడుతుంది. కేంద్ర సర్కార్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై టిఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది.

 జాతీయ రహదారులపై ఆందోళనలకు దిగిన గులాబీ నేతలు

జాతీయ రహదారులపై ఆందోళనలకు దిగిన గులాబీ నేతలు


ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. పలు చోట్ల రహదారులపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఇక ఈ క్రమంలో జాతీయ రహదారులపైన కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జాతీయ రహదారులపై ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

ఆందోళనలలో పాల్గొన్న మంత్రులు... ధాన్యం కొనుగోలుకు డిమాండ్

ఆందోళనలలో పాల్గొన్న మంత్రులు... ధాన్యం కొనుగోలుకు డిమాండ్

బుధవారంనాడు రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులు వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున జాతీయ రహదారులపై ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ జిల్లా లో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సూర్యాపేట జిల్లాలో జగదీష్ రెడ్డి, నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్ వద్ద ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు, రైతు బంధు సమితి బాధ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కేంద్రం మొండి వైఖరి విడనాడాలని, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనే వరకు ఆందోళనలు విరమించేది లేదన్న గులాబీ నేతలు

ధాన్యం కొనే వరకు ఆందోళనలు విరమించేది లేదన్న గులాబీ నేతలు


నాగపూర్, ముంబై , బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. జాతీయ రహదారుల మీద గులాబీ నేతల ఆందోళనలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కొని తీరాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు ఆపేది లేదని చెప్తున్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణా రాష్ట్రంలోనూ ధాన్యం సేకరణ విధానం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు పార్లమెంటులోనూ యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
TRS Rasta rokos on national highways. Ministers and party ranks are holding rasta roko on national highways demanding the paddy procurement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X