ముందస్తు ఎన్నికలపై సీఎం సన్నిహిత నేత సంచలనం - మునుగోడు బై పోల్ పై ఎఫెక్ట్..!!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి సన్నిహత నేత చేసిన వ్యాఖ్యలతో ముందస్తు పైన చర్చతో మరింత వేడి పెంచుతోంది. తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ - బీజేపీ- కాంగ్రెస్ మూడు పార్టీలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ముఖ్య నేతలు అటు టీఆర్ఎస్..ఇటు కాంగ్రెస్ నుంచి కీలక నేతలను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలకు పదును పెడుతోంది.

ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త

ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త

అందులో భాగంగా..తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మునుగోడు లో బై పోల్ కోసం బీజేపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ అప్పుడే మునుగోడు ఉప ఎన్నిక కోసం కమిటీని కూడా ప్రకటించింది. ఇంత హంగామా జరుగుతున్నా.. టీఆర్ఎస్ మౌనం పాటిస్తోంది. ఎక్కడా మునుగోడు ఉప ఎన్నిక..రాజగోపాల్ రాజీనామా..బీజేపీ ఎత్తుల పైన ఎక్కడా స్పందించటం లేదు. తాజాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహిత నేత అయిన తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేసారు. కార్యకర్తలు సిద్ద కండీ అంటూ పిలుపునిచ్చారు. ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినచ్చు అంటూ సంచలనానికి తెర లేపారు. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన రాజగోపాల్ తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇస్తానని చెప్పుకొచ్చారు.

రాజగోపాల్ రాజీనామా వేళ

రాజగోపాల్ రాజీనామా వేళ


అదే సమయంలో మునుగోడు ప్రజలు కోరుకుంటే తిరిగి ఎమ్మెల్యే అవుతానని పేర్కొన్నారు. అటు టీఆర్ఎస్ మునుగోడు పైన మౌనం పాటించటం అనేక సందేహాలకు కారణం అవుతోంది. కాంగ్రెస్ లోని నేతల మధ్య ఆరోపణలు - బీజేపీ స్పందనతో రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయం వారిద్దరి మధ్యే నడుస్తోంది. టీపీసీసీ చీఫ్ పైన రాజగోపాల్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీ వైపు అడుగులు వేస్తున్న రాజగోపాల్ పైన రేవంత్ అండ్ టీం ఫైర్ అవుతోంది. ఈ వేడి కొనసాగుతన్న సమయంలోనే సీనియర్ నేత తుమ్మల కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ - తుమ్మల రాజకీయంగా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సాన్నిహిత్యం ఉంది. దీంతో..ఇప్పుడు తుమ్మల సిద్దం కండి ..ఏ క్షణమైనా ఎన్నికలు అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్ తో పాటుగా ప్రతిపక్ష పార్టీల్లోనూ చర్చకు కారణమవుతున్నాయి. దీంతో..ఒక్క సారిగా మునుగోడు బై పోల్ చర్చ నుంచి ముందస్తు ఎన్నికల వైపు అందరి ఫోకస్ మళ్లింది.

మునుగోడు ఉప ఎన్నిక - కొత్త చర్చ

మునుగోడు ఉప ఎన్నిక - కొత్త చర్చ


ముందస్తు గురించి టీఆర్ఎస్ తో కదలిక వస్తే... రాజగోపాల్ రాజీనామా అంశం..మునుగోడు బై పోల్ పైనా ప్రభావం చేపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే సర్వేలు చేయిస్తున్న ముఖ్యమంత్రి ..ఇటువంటి కీలక అంశాల్లో ఆచి తూచి నిర్ణయం తీసుకోనున్నారు. మునుగోడు లో బై పోల్ జరిగితే... గుజరాత్ ఎన్నికలతో పాటుగా నిర్వహించే అవకాశం ఉంది. అయితే, కేంద్రం పార్లమెంట్ ఎన్నికలు ముందుగానే డిసైడ్ చేస్తే...తాను అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్దమని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. కానీ, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు.. జాతీయ రాజకీయాల్లో తన ఎంట్రీ.. ప్రాభవం అంశాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం అవసరం లేదని గులాబీ నేతలు భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు తుమ్మల చేసిన వ్యాఖ్యల వెనుక అసలు విషయం ఏంటనేది ఒకటి రెండు రోజల్లోనే క్లారిటీ వచ్చే అవకావం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+